ఆడ, మగా ఎవరికైనా పొట్టలో పేగుల నుండి శబ్దాలు రావడం సహజం

ఈ శబ్దాలు అసలు ఎందుకొస్తాయి? వీటి వలన ఏమైనా హానీ ఉంటుందా?

తిన్న ఆహారం జీర్ణాశ‌యంలో జీర్ణం అయ్యాక చిన్న పేగుల‌కు చేరుతుంది

అక్క‌డ నుండి జీర్ణమైన ఆహారంలోని పోష‌కాల‌ను శ‌రీరం శోషించుకుంటుంది

మిగిలిన వ్య‌ర్థాలు పెద్ద పేగు ద్వారా బ‌య‌ట‌కు వచ్చేస్తాయి

పేగుల్లో ఆహారం క‌ద‌లిక‌లతో కొన్నిసార్లు గ్యాస్ ఏర్ప‌డి శ‌బ్దాలుగా మారుతుంది

శబ్దాలు మోస్త‌రు స్థాయిలో రావడం సహజం.. దానికి ఖంగారు పడాల్సింది లేదు

అయితే, అస‌లు శ‌బ్దాలు రాక‌పోతే జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నాయని అర్థమట

ఒకవేళ ఎక్కువగా శబ్దాలు వస్తే గ్యాస్, విరేచ‌నాల స‌మ‌స్య ఉంద‌ని అర్థమట

ఈ శబ్దాలను బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చట