భోగి రోజున.. పిల్లలకు రేగి పండ్లు ఎందుకు పోస్తారంటే

భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. 

భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. 

కొందరు శనగలు, అనపకాయలు కూడా కలుపుతారు. 

రేగి పళ్లను పిల్లల తల మీద పోయటం వలన..

శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. 

భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీదున్న చెడు దృష్టి తొలగిపొతుందని నమ్మకం. 

తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. 

భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.

సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు. 

కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 

12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.