వాహనాల నంబర్ ప్లేట్‌లకు విభిన్నమైన రంగులు ఎందుకుంటాయో.. వాటి అర్థాలేంటో తెలుసా?

వివిధ వాహ‌నాల‌కు అనేక రంగుల నంబర్ ప్లేట్లు తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, నీలం రంగుల నంబర్ ప్లేట్లు క‌నిపిస్తుంటాయి.

ఈ రంగుల నంబర్ ప్లేట్ల వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది.నంబర్ ప్లేట్ రంగును బట్టి..ఆ వాహనం ఏ కేటగిరీకి చెందినదో..అంటే ప్రైవేటుదా, కమర్షియల్‌దా? ఇంకా మరేదైనా అని తెలుసుకోవ‌చ్చు.

అద్దెకు ఇవ్వబడే వాణిజ్య వాహనాలపై మాత్రమే నలుపు రంగు నంబర్ ప్లేట్లు అమర్చబడి ఉంటాయి..అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకిచ్చే వాహనాలపై కూడా ఇలా ఉంటాయి.

భారత రాష్ట్రపతి..ఆయ రాష్ట్రాల గవర్నర్ల‌ వాహనాలపై మాత్రమే రెడ్ నంబర్ ప్లేట్లు అమర్చబడి ఉంటాయి.ఈ నంబర్ ప్లేట్లపై నంబర్లకు బదులుగా అశోక చిహ్నం క‌నిపిస్తుంది.

ప్రైవేట్ వినియోగ వాహనాలకు మాత్రమే వైట్ కలర్ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేస్తారు. మీ ఇంట్లో మోటార్ సైకిల్ లేదా కారు ఉంటే, దాని నంబర్ ప్లేట్ కూడా తెలుపు రంగులో ఉంటుంది. చిత్రమేంటంటే..ఓ సాధారణ వ్యక్తి కారు నంబర్ ప్లేట్ వలెనే.. భారత ప్రధాని కార్ల నంబర్ ప్లేట్ కూడా తెలుపులోనే ఉంటుంది.

విదేశీ ప్రతినిధులు ఉపయోగించే వాహనాలకు మాత్రమే బ్లూ కలర్ నంబర్ ప్లేట్‌లు ఉంటుంది. విదేశీ రాయబారులు లేదా దౌత్యవేత్తలు నీలిరంగు నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తారు.

బ్లూ నంబర్ ప్లేట్

పబ్లిక్, వాణిజ్య ఉపయోగించే  వాహనాలకు మాత్రమే పసుపు నంబర్ ప్లేట్లు ఉంటాయి. బస్సులు, టాక్సీలు, క్యాబ్‌లు, ఆటో రిక్షాలు, బైక్ ట్యాక్సీలు మొదలైన పబ్లిక్ వాహనాలు.ఇవి కాకుండా, హైవే, ట్రైలర్, ట్రక్, మినీ ట్రక్ మొదలైన వాణిజ్య వస్తువుల వాహనాలపై కూడా పసుపు రంగు నంబర్ ప్లేట్‌ను అమరుస్తారు.