చెంప దెబ్బ ఎఫెక్ట్..  ఆగిపోయిన సినిమాలు..  డౌట్‌లో విల్‌స్మిత్ సినిమా కెరీర్..

94వ ఆస్కార్‌ అవార్డుల వేడుక మార్చ్ 27న జరిగాయి. అయితే ఈ సారి ఆస్కార్ అవార్డు వేడుకల్లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.

అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌‌రాక్‌ మాట్లాడుతూ మధ్యలో విల్‌‌స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌‌పై జోక్‌ చేశాడు. అనారోగ్యంతో ఆమె గుండు చేయించుకుని ఉండగా, ఆమె లుక్‌ మీద క్రిస్‌ జోక్‌ వేశాడు.

దీంతో అప్పటిదాకా ఎంజాయ్ చేస్తున్న విల్‌స్మిత్ కోపం తెచ్చుకొని కూర్చున్న చోటు నుంచి లేచి స్టేజిమీదకి వెళ్లి క్రిస్‌ని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు.

విల్‌స్మిత్ క్రిస్‌ని కొట్టిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విల్‌ స్మిత్‌ ఆస్కార్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని పలువురు పోస్టులు చేస్తున్నారు కూడా.

అయితే అదే రోజు విల్ స్మిత్ స్పీచ్ లో క్రిస్ కి సారీ కూడా చెప్పాడు.

ఆ తర్వాత కూడా గొడవ సద్దుమణగకపోవడంతో హాలీవుడ్‌ ఫిల్మ్‌ అకాడమీకి విల్‌ స్మిత్ రాజీనామా చేస్తూ బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే అని కూడా తెలిపాడు.

అయితే ఈ చెంప దెబ్బ ఎఫెక్ట్ విల్ స్మిత్ కెరీర్ పైన కూడా ఎఫెక్ట్ చూపనుంది.

విల్‌ స్మిత్ హీరోగా రాబోయే 'ఫాస్ట్‌ అండ్‌ లూజ్‌' సినిమాని నిర్మిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ ప్రస్తుతం ఆ మూవీని హోల్డ్‌లో పెట్టింది.

'బ్యాడ్‌ బాయ్స్ 4' సినిమా కోసం ఇప్పటికే విల్ స్మిత్ తో మాట్లాడగా ఈ సినిమాని కూడా హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం.

అవి కాకుండా విల్ స్మిత్‌ చేతిలో ఎమాన్సిపేషన్‌, యాపిల్‌ టీవీ ప్లస్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. వీటి గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.

ఒక్క చెంప దెబ్బతో ప్రపంచం మొత్తం నెగిటివ్ అయ్యాడు విల్ స్మిత్, అలాగే తన కెరీర్ కూడా ఆగిపోనుందా అని ఆలోచిస్తున్నారు.

భార్యని తిడితే ఎవరు ఊరుకుంటారు అందుకే కొట్టాడు అని చాలా మంది విల్ స్మిత్ కి సపోర్ట్ కూడా చేస్తున్నారు. మరి విల్ స్మిత్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.