క్రెడిట్ కార్డుతో నగదు డ్రా చేయడం బెటరా? రుణం తీసుకోవడం బెటరా?

క్రెడిట్ కార్డుతో నగదు డ్రా చేయడం కన్నా అదే కార్డుపై రుణం తీసుకోవడం మేలంటున్న ఆర్థిక నిపుణులు.

తక్కువ వడ్డీ (నగదు డ్రా చేయడంతో పోలిస్తే)తో మీ అవసరానికి నగదు వాడుకోవడానికి ఈ పద్ధతి ఉత్తమం. 

క్రెడిట్ కార్డుతో నగదు డ్రా చేస్తే వడ్డీ ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.

అదే రుణం తీసుకుంటే తక్కువ వడ్డీతో పని పూర్తవుతుంది. 

పైగా ఇలా చేయడం వల్ల మీ సిబిల్ స్కోరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు.

నగదు డ్రా చేయడం వల్ల మీ క్రెడిట్ పరిమితిపై ప్రభావం పడుతుంది. 

ఇలా డ్రా చేసిన సొమ్ముపై బ్యాంకులు 36 శాతం నుంచి 48 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. 

మిగిలిన మొత్తం చివరి చెల్లింపు రోజులోపు చెల్లించాలి. 

చెల్లింపులు సకాలంలో చేయకుంటే వడ్డీ పెరుగుతుంది.

కార్డుపై రుణం తీసుకోవడం చాలా సులభం. 

కార్డు పొందేటపుడే అన్ని రకాల పత్రాలు బ్యాంకుకు అందజేస్తారు కాబట్టి..

వీటిపై రుణం తీసుకునేటపుడు కొత్తగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. 

ఇలా తీసుకున్న రుణాలను ఈఎంఐ కింద మార్చుకునే సదుపాయం ఉంటుంది. 

ఈ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు 16 నుంచి 18శాతం ఉంటుంది. 

కార్డు లిమిట్ తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తం నగదును రుణంగా పొందవచ్చు. 

వ్యక్తిగత రుణాలతో పోలిస్తే క్రెడిట్ కార్డుపై తీసుకునే రుణానికి వడ్డీ కాస్త ఎక్కువే.