మార్చి 21.. ప్రపంచ అటవీ దినోత్సవం..

మానవ మనుగడలో అడవుల (వృక్షముల) పాత్ర ఎంతో కీలకమైనది..

అదే ప్రపంచ  అటవీ దినోత్సవం ప్రత్యేకత..

అడవుల పరిరక్షణ ఆవశ్యకత..ప్రజల్లో చైతన్యం రావాలని మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు పర్యావరణ అభివృద్దికి అడవులు ఎంతో అవసరమని తెలియజేయటం ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం..

మొక్కలు నాటే కార్యక్రమాలతోపాటు,ఆర్ట్, ఫిల్మ్, ఫోటో, సోషల్ మీడియా ద్వారా జాతీయ ఉత్సవాలను, కమ్యూనిటీ స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ప్రజల్లో, ప్రతిరోజూ అడవుల ప్రాముఖ్యతను గుర్తు చేయడం, అవగాహన కల్పించడం కోసం ప్రపంచ అటవీ సంవత్సరంగా ప్రకటించారు.

యునైటెడ్ నేషన్స్ మార్చి 21, 2012 తీర్మానంను అనుసరించి మార్చి 21,2013ను తొలి ప్రపంచ అటవీ దినోత్సవంగా జరిపింది.

మొక్కలు నాటితే క్షేమం-  చెట్లు నరికితే క్షామం..

చెట్లే ప్రగతికి మెట్లు.. చెట్టు నరికితే ఇక్కట్లు.. పచ్చదనం ప్రగతికి సంకేతం..

ఇంటింటా చెట్టు.. ఊరూరా పచ్చదనం..

ఇటువంటి నినాదాలు చేయటమే కాదు..అమలు చేయటం కూడా ప్రతీ ఒక్కరి కర్తవ్యం..

వేల వేలుగా మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదాం..