ఒంటరిగా జీవించే మనుషులను చూశాం..కానీ ప్రపంచంలోనే అత్యంత ‘ఒంటరి’ చెట్టు ఉందనీ మీకు తెలుసా? ఆ చెట్టేంటీ..ఒంటరిగా ఉండటమేంటి? అది ఎక్కడుందో..ఆ విశేషాలేంటో చూసేద్దాం..

ఇది ప్రపంచంలోనే అత్యంత ‘ఒంటరి’ వృక్షం..  పేరు ‘సిట్కా స్ర్పస్’..

న్యూజిలాండ్ లోని క్యాంప్ బెల్ దీవిలో ఈ భారీ వృక్షం 125ఏళ్లుగా ఒంటరిగానే ఉంది..

ఈ దీవిలో గడ్డి, చిన్న చిన్న మొక్కలు తప్ప మరో చెట్టే కనిపించదు..అందుకే ఇది ‘ఒంటరి’ చెట్టు.. 

ఈ చెట్టు గురించి ఓ గొప్ప విషయం గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే..

దీనికి దగ్గరలోని ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ భూభాగాలనుంచి వాటికి దక్షిణాన ఉన్న సముద్రం నుంచి వెలువడే కర్భన్ ఉద్గారాల్లో 10శాతం ఉద్గారాలను ఈ ఒక్క చెట్టే పీల్చేసుకుంటుంది.

భూతాపంతో వస్తున్న వాతావరణ మార్పులను కంట్రోల్ చేయటంలో ఈ  ‘సిట్కా స్ర్పస్’ చెట్టు కాలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..

ఈ క్యాంప్ బెల్ దీవిలో ఏడాదికి 325 రోజులు వర్షం కురుస్తునే ఉంటుంది...

ఏడాదిలో రోజుకు ఓ గంటసేపు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు..మిగత అన్ని సమయాల్లోనే మబ్బులు లేక వర్షం కురుస్తు ఉంటుంది..

ఏడాదిలో ఎక్కవ రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రత దాదాపు 6 డిగ్రీల సెల్సియస్ గా నమోదువుతుంటుంది..