ప్రకృతిలో ఎన్నో వింతలు..మరెన్నో రహస్యాలు. ప్రకృతి అద్భుతాల్లో పోలాండ్‌లోని  క్రూకెడ్ ఫారెస్ట్ కూడా ఒకటి..

పోలాండ్‌లోని నౌవే సజర్నోవో గ్రామానికి సమీపంలో ఉన్న క్రూకెడ్ ఫారెస్ట్

క్రూకెడ్ ఫారెస్ట్ లో చెట్లు వంగి ఉంటాయి. ఈ వింతే ఈ అడవిని ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిపింది...

ఇక్కడి చెట్లు 90 డిగ్రీల వరకు వంగి ఉంటాయి. 3 నుంచి 9 అడుగులు పెరిగిన తర్వాత చెట్లు ఇలా  మారుతుంటాయి.

రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభానికి ముందు 1930 సంవత్సరంలో నాటినట్లు తెలుస్తోంది..

ఈ చెట్ల వంపు కారణంగా ఈ అడవికి క్రూకెడ్ ఫారెస్ట్ అని పేరు వచ్చింది.

క్రూకెడ్ ఫారెస్ట్ పోలాండ్‌లో చాలా ప్రసిద్ధి చెందింది.ఈ మొక్కలను నాటడానికి కొన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని చెబుతారు.

చెట్లు మెలికలు తిరగడంతో పాటు, అవన్నీ ఒకే దిశలో వంపు తిరగడం మరింత ఆశ్చర్యంగా ఉంటుంది.

ఈనాటికీ కూడా ఈ అడవిలోని చెట్లు మిస్టరీగా మిగిలిపోయాయి. గురుత్వాకర్షణ శక్తి వల్ల చెట్లు మెలికలు తిరుగుతున్నాయని నిపుణులు చెబుతుంటారు.

ప్రకృతి వింతల్లో ఒకటిగా ఉన్న  ఈ చెట్ల వల్లే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకతగా నిలిచింది..