బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ 2023లో టాప్-10 ఐటీ సర్వీస్ బ్రాండ్స్ జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో అమెరికా కంపెనీ అక్సెంటర్ మొదటి స్థానం దక్కించుకోగా రెండు, మూడు స్థానాల్లో భారత కంపెనీ బ్రాండ్లు ఉన్నాయి. ఇక టాప్-10 జాబితాలో అమెరికాను వెనక్కి నెట్టి నాలుగు కంపెనీలతో భారత్ మేటిగా నిలవడం గమనార్హం. బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించిన టాప్-10 జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

అక్సెంటర్ - 39.9 బిలియన్ డాలర్లు

టీసీఎస్ - 17.2 బిలియన్ డాలర్లు

ఇన్ఫోసిస్ - 13.01 బిలియన్ డాలర్లు

ఐబీఎం - 11.6 బిలియన్ డాలర్లు

క్యాపెమిని - 9.8 బిలియన్ డాలర్లు

ఎన్‭టీటీ డేటా - 8.9 బిలియన్ డాలర్లు

కాగ్నిజెంట్ - 8.6 బిలియన్ డాలర్లు

హెచ్‭సీఎల్ టెక్ - 6.5 బిలియన్ డాలర్లు

విప్రో - 6.2 బిలియన్ డాలర్లు

ఫిజిత్సు - 4.3 బిలియన్ డాలర్లు