ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపంలో మళ్లీ విజృంభిస్తోంది.

ఒమిక్రాన్‌ స్ట్రెయిన్స్ (BA1, BA2) కాంబినేషన్‌తో ‘XE Omicron’ కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త వేరియంట్ గుర్తించింది.

ఈ వైరస్ మూడో కరోనా వేవ్ కన్నా 10 రెట్లు అధికంగా ఉంటుంది. 

ఇప్పటికే 600కుపైగా కేసులు నమోదైనట్లు WHO హెచ్చరిస్తోంది.

కొత్త వేరియంట్‌ యూకేలో జనవరి 19న తొలిసారిగా బయటపడింది. 

ఈ వైరస్‌కు సంబంధించి లక్షణాలను నిపుణులు వెల్లడించారు.

బాధితుల్లో ముందుగా జ్వరం, గొంతు నొప్పి, గొంతులో మంట వంటి లక్షణాలు ఉంటాయి.

దగ్గు, జలుబు, చర్మం రంగు మారడం, చర్మం దురద, జీర్ణకోశ సమస్యలు ఉంటాయి.

వైరస్ తీవ్రత ఉన్న వారిలో గుండె జబ్బులు, గుండెదడ, నరాల్లో బలహీనత వంటి సమస్యలు దారితీస్తుంది.