మళ్లీ భారత రోడ్లపై పరుగులు తీయనున్న యమహా ఆర్ఎక్స్ 100

భారత్ లో 80, 90వ దశకాల్లో కుర్రకారును ఓ ఊపు ఊపిన బైకుల్లో యమహా ఆర్ఎక్స్ 100 ఒకటి. 

ఈ బైకుల ఉత్పత్తిని యమహా 1996 తర్వాత నిలిపివేసినా, 

ఇప్పటికీ ఒకటీ అరా కనిపిస్తుంటాయి. 

లైట్ వెయిట్, చూడగానే ఆకట్టుకునే రూపంతో, శక్తిమంతమైన 2 స్ట్రోక్ ఇంజిన్.

ఇది సృష్టించే ధ్వని మిగతా బైకులతో పోల్చితే దీన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. 

ఆర్ఎక్స్ 100 బైక్ మళ్లీ భారత రోడ్లపై రయ్యిమంటూ దూసుకెళ్లేందుకు ముస్తాబవుతోంది. 

ఈసారి కొత్త రూపుతో రానుంది.

లేటెస్ట్ ఆర్ఎక్స్ 100 బైక్ ను త్వరలోనే తీసుకొస్తామని యమహా ప్రకటన.

టు స్ట్రోక్ ఇంజిన్ కనిపించకపోవచ్చు. 300 సీసీ శక్తితో పెద్ద ఇంజిన్ అమర్చనున్నారు. 

గతంలో ఆర్ఎక్స్ 100 కేవలం 98 సీసీ ఇంజిన్ మాత్రమే కలిగి ఉన్నప్పటికీ..

2 స్ట్రోక్ శక్తితో వేగంగా దూసుకెళ్లేది.

103 కిలోల బరువుతో తేలిగ్గా కనిపించే ఈ బండి..

వేగంలో ఇప్పటి 150-160 సీసీ బైకులకు ఏమాత్రం తీసిపోని రీతిలో నిలుస్తుంది. 

కొత్తగా వచ్చే ఆర్ఎక్స్ 100 బైక్ రెట్రో లుక్ తో..

భారత్ లో 80, 90వ దశకాల్లో కుర్రకారును ఓ ఊపు ఊపిన బైకుల్లో యమహా ఆర్ఎక్స్ 100 ఒకటి.