తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పట్నుంచో ఉన్న నిర్మాతల సంఖ్యే ఎక్కువ. కానీ ఇటీవల మహిళా యువ నిర్మాతలు వస్తున్నారు. మంచి మంచి సినిమాలని అందించాలని నిర్మాతలుగా మారుతున్నారు. వీరు సినీ పరిశ్రమకి చెందిన మహిళలు కావడం విశేషం.

అశ్వినీదత్ కుమార్తెలు స్వప్న, ప్రియాంక దత్ లు 'స్వప్న సినిమాస్' బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు నిర్మించిన వీరు 'మహానటి' సినిమాతో స్థిరపడ్డారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న 'ప్రాజెక్టు K' సినిమాలో కూడా భాగమయ్యారు.

దర్శకుడు గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ కూడా సమంత మెయిన్ లీడ్ లో రాబోతున్న 'శాకుంతలం' సినిమాతో నిర్మాతగా మారింది.

ప్రముఖ దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య కూడా నిర్మాతగా మారి 'కోడి ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ స్థాపించి కిరణ్ అబ్బవరంతో సినిమా చేస్తుంది.

దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి ఓటీటీలకు సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తుంది.

చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల 'గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తుంది.

ప్రభాస్ చెల్లి, కృష్ణంరాజు కూతురు ప్రసీద ఇప్పుడు 'రాధేశ్యామ్' సినిమాకి సహనిర్మాతగా వ్యవహరిస్తోంది.

పరుచూరి విజయ ప్రవీణ 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో నిర్మాతగా మారి ఇప్పుడు వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు.

ఇండస్ట్రీలో ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ ఇటీవల కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' సినిమాతో నిర్మాతగా మారింది.

వీరే కాకుండా కొంతమంది హీరోయిన్స్ కూడా సినిమాలలో పెట్టుబడులు పెడుతూ సహ నిర్మాతలుగా మారుతున్నారు.