‘మహా’ ఘనకార్యం : బొమ్మకు పోస్ట్ మార్టం చేయించిన పోలీసులు..అసలు విషయం తెలిసి దిమ్మతిరిగిపోయింది..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మ‌హ‌రాష్ట్ర పోలీసులు పప్పులో కాలేశారు..అది అలాంటింలాంటిది కాదు. వింటే ఆశ్చర్యపోవాల్సిందే. బొమ్మకు నిజమైన శిశువుకుతేడా తెలీలేదు మహా పోలీసులకు. ఓ బొమ్మను తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయమని డాక్టర్లకిచ్చారు..! ఇక్కడ మరో విశేషమేంటంటే..డాక్టర్లు కూడా ఆ బొమ్మను తీసుకెళ్లి పోస్ట్ మార్టం కోసం కోసి చూడగా అది శిశువు మృతదేహం కాదు బొమ్మ అని తేలింది..!!

వివరాల్లోకి వెళితే..మహారాష్ట్ర బుల్డానా జిల్లా ఖామ్​గావ్ తాలూకా బోర్జావాల్ గ్రామం సమీపంలో ఉన్న ఓనదిలో గురువారం (జులై9,2020) ఓ శిశువు మృతదేహం స్థానికులకు కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఖుమ్ గావ్ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

7,8 నెలల వయస్సు ఉన్న ఆ శిశువుని నదిలో ఎవరు పారేశారు? చంపేసి పారేశారా? లేక చంపేయటానికి పారేశారా? ఎవరు? ఎందుకు? అనే కోణంలో దర్యాప్తుచేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకు కఠినంగా శిక్షించాలని అనుకున్నారు. దీంట్లో భాగాంగా ఆ శివువు ఎలా చనిపోయిందో తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్టు రావాలి. విచార‌ణ‌లో భాగంగా మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు త‌ర‌లించారు.

సరిగ్గా అక్కడే పోలీసులకు డాక్టర్లు దిమ్మతిరిగే విషయం చెప్పారు. అదే పోలీసులు తీసుకువచ్చింది శిశువు మృతదేహం కాదనీ అది అచ్చం శిశువులా కనిపించే ఓ ఆట‌ బొమ్మ అని చెప్పారు. దీంతో పోలీసులు తెల్లమొహం వేశారు. బొమ్మకు, శిశువుకు తేడా తెలుసుకోలేని తాము పోలీసులం ఎలా అయ్యామని అనుకున్నారో ఏమోగానీ..బిక్కచచ్చిపోయారు. ఈ విషయం బైటకు తెలిస్తే పరువు పోతుందని తెగ బాధపడిపోయారు. కానీ బైటకు తెలియనే తెలిసింది..వీళ్లు నిజంగానే పోలీసులేనా..అని జనాలు నవ్వుకుంటున్నారట..

Related Posts