లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

పవన్ కళ్యాణ్, రానా సినిమాకి త్రివిక్రమ్ మాటలు

Published

on

Pawan Kalyan, Rana Daggubati : పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ ఫ్రైజ్ ల మీద సర్ ఫ్రైజ్ లు వచ్చి పడుతున్నాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యేలా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. రానా, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేశారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని…2021, జనవరి 15వ తేదీ కనుమ సందర్భంగా శుక్రవారం సాయంత్రం సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో సాంకేతిక నిపుణుల పేర్లను బయటపెట్టిింది. పీడీవీ ప్రసాద్ (సితారా ఎంటర్ టైన్ మెంట్స్) సమర్పణలో సెల్యూలాడ్ మేజిషీయన్ కు గ్రాండ్ వెల్ కమ్ చెబుతున్నట్లు తెలిపారు. చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్ లు రాస్తున్నారని ప్రొడక్షన్ 12గా వెల్లడించారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర డైరెక్షన్ చేస్తున్నారు. నాగ వంశీ ప్రొడ్యూసర్‌గా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. పవన్ భార్యగా సాయి పల్లవి, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పన్ కోషియమ్ రీమెక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. వకీల్ సాబ్ చిత్రాన్ని కొద్ది రోజుల కిందట కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ తో పవన్ ఫిల్మ్ కన్ఫాం అనగానే..అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. పవన్, రానాల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.