Welcome varalaxmi sarathkumar on board for RaviTeja 66

రవితేజ 66లో వరలక్ష్మీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రవితేజ 66లో ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం రలక్ష్మీ శరత్ కుమార్‌ని సెలెక్ట్ చేసినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది..

మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హీరోగా రవితేజకిది 66వ సినిమా.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయ్యాడు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటించనుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.

రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌లోకి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఎంటరైంది. ‘పందెంకోడి 2’, ‘సర్కార్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్.. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘తెనాలి రామకృష్ణ BA.BL’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచమవుతుంది. నవంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది.

రవితేజ 66లో ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం వరూని సెలెక్ట్ చేసినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా’ 2020 జనవరి 24న విడుదల కానుంది.

Related Posts