లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

వెల్ కమ్ సిద్ధ : ఆచార్య లెటెస్ట్ అప్ డేట్

Published

on

SIDDHA’ on to the sets of Acharya : మెగాస్టార్ చిరంజీవి న్యూ ఫిల్మ్ ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి న్యూ అప్ డేట్ వచ్చింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజకు చిత్ర యూనిట్ వెల్ కమ్ చెప్పింది. సెట్స్ లోని ఆహ్వానిస్తున్నామని, మెగా పవర్ స్టార్ షూట్ లో జాయిన్ అవుతున్నట్లు కొణిదెల ప్రో కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. దీంతో రామ్ చరణ్ తేజ ఈ సినిమాలో నటిస్తున్నారని వెల్లడైంది.

దేవాలయం ఎదుట చెవికి చెయి పోగు, మెడలో రుద్రాక్ష మాల ధరించి నిలబడ్డాడు. గత కొన్ని రోజులుగా ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే..దీనిని అధికారికంగా చిత్ర యూనిట్ ధృవీకరించలేదు. ఈ సినిమాలో సిద్ధ పాత్రలో నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనంతరం చిరు కరోనా బారిన పడడంతో అంతా ఆందోళన చెందారు. అయితే..కరోనా సోకలేదని వెల్లడైంది. మరలా షూటింగ్ ప్రారంభమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారు. ఇటీవలే ఆచార్య’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ విడుదలైంది. దీనికి ఫుల్ రెస్పాండ్ వచ్చింది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్.. అని కామెంట్స్ చేస్తున్నారు. చక్కటి సందేశానికి కమర్షియల్ హంగులు జతచేసి చెప్పడంలో సిద్ధహస్తుడైన కొరటాల ‘ఆచార్య’ లోనూ తన మార్క్ మెసేజ్ చూపించనున్నారు. చిరు ఈ సినిమాలో ‘‘ధర్మ’’ అనే పాత్రలో కనిపించనున్నారు. ‘ఆచార్య’ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: తిరు, ఎడిటింగ్: నవీన్ నూలి.