సచిన్ పైలట్ కు షాక్ : జైపూర్ కు 3 MLAలు…ట్రబుల్ షూటర్స్ ని రాజస్థాన్ పంపిన కాంగ్రెస్ హైకమాండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజస్థాన్‌ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం నెలకొన్న సమయంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. సచిన్ పైలట్ తో పాటుగా ఢిల్లీ వెళ్లిన 16 ఎమ్మెల్యేలలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోహిత్ బొహ్ర, డేనిష్ అబ్రర్,చేతన్ దుడి తిరిగి జైపూర్ చేరుకున్నారు. తాము నిజమైన కాంగ్రెస్ సైనికులు అని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తెలిపారు.

ఎమ్మెల్యేలు జైపూర్ తిరిగి వచ్చిన వెంటనే కాంగ్రెస్.. సీఎం నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను ఢిల్లీ వెళ్ళానని, చివరి శ్వాస వరకు తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని బెహ్రా పేర్కొన్నారు. డానిష్ అబ్రార్ సచిన్ పైలట్‌తో తన సమావేశాన్ని తక్కువ చేసి, తాను రాజస్థాన్ కాంగ్రెస్‌లో భాగమైనందున ఇది ‘రొటీన్’ అని చెప్పాడు. బీజేపీ తనను సంప్రదించలేదని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ, రాజస్థాన్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ యాక్టీవ్ అయింది. పరిస్థితిని చక్కదిద్ధేందుకు రణదీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్ వంటి సీనియర్ నాయకులను జైపూర్‌కు పంపింది పార్టీ హైకమాండ్ . ఈ రాత్రి తన నివాసంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఏర్పాటు చేయనున్న సమావేశంలో మాకెన్ మరియు సుర్జేవాలా హాజరుకానున్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ అవినాష్ పాండే కూడా హాజరుకానున్నారు.

మరోవైపు, 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ కు మద్దతు పలికినట్టు సమాచారం. సచిన్ పైలట్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తమ మద్దతు ఉంటుందని ఆ 30 మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

Related Posts