భర్తను హత్య చేసిన లాయర్ భార్య…..దోషిగా తేల్చిన కోర్టు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భార్యా భర్తల మధ్య ఉండాల్సిన సంబంధాలు రాను రాను ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాళ్లు ఏవో కారణాలతో వారిని తుదముట్టిస్తున్నారు. వైవాహిక బంధానికే మచ్చ తెస్తున్నారు. హైకోర్టు లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న భార్య భర్తలు మధ్య ఏంజరిగిందో తెలీదు… కానీ భార్య, భర్తను హత్య చేసింది.

లాయర్ కాబట్టి తెలివిగా కేసు నుంచి తప్పించుకోవచ్చు…సాక్ష్యాలు లేకుండా చేయొచ్చు, అనుకుందో ఏమో..భర్తను హత్య చేసి , హార్ట్ ఎటాక్ తో భర్త మరణించినట్లు కధలు అల్లింది. కానీ పోస్టు మార్టం నివేదిక చూసిన పోలీసులు పకడ్బందీగా సాక్ష్యాలు సేకరించారు. లాయర్ చేసిన తప్పులకు సాక్ష్యాలను సాంకేతికంగా సంపాదించి కోర్టుకు సమర్పించి ఆమెను దోషిగా తేల్చారు.కోల్ కతా లోని న్యూటౌన్, రాజ్ హట్ ప్రాంతంలో డిబి97 అపార్ట్ మెంట్ లోని ఒక ఫ్లాట్ లో కలకత్తా హై కోర్టు లాయర్లైన భార్యా,భర్తలు రజత్ కుమార్ డే, అనిందితా డే లు నివసిస్తున్నారు. 2018, నవంబర్ 25న లాయర్ రజత్ తనఅపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్ధితిలో మరణించారు. గుండెపోటుతో తన భర్త మరణించినట్లు భార్య అనిందిత పోలీసులకు చెప్పారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని అనిందితను విచారించారు. విచారణ సమయంలో ఆమె కేసును తప్పుదోవ పట్టించింది. రజత్ పోస్టుమార్టం రిపోర్టులో మొబైల్ ఫోన్ చార్జర్ వైరు గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపినట్లు వెల్లడైంది.పోలీసులు అనిందితా మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసును పరిశోధించి సాక్ష్యాలను పక్కాగా సేకరించి కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాలను పరిశీలించిన ఉత్తర 24పరగణాల్లోని బరాసత్ లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అనిందితాను దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ప్రకటించనుంది.

 

Related Posts