ఏందీ మాకీ తిప్పలు : పోలీస్ స్టేషన్ లో మేకల్ని పెంచుతున్న పోలీసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పోలీస్ స్టేషన్ లో ఓ మేక ఈనింది. రెండు బుజ్జి మేకపిల్లల్ని ప్రసవించింది. పోలీసులు ఆ మేక పిల్లల బాగోగులు చూస్తున్నారు. ఇదేంటీ పోలీస్ స్టేషన్లో పోలీసులకు పనేమీ లేదా మేకల్ని కాస్తున్నారు? అనుకుంటున్నారా? కాదులెండి..పాపం వాళ్లకా తిప్పలు వచ్చి పడ్డాయి మరేం చేస్తారు?


వివరాల్లోకి వెళితే..పోలీసులు ప్రజా ప్రతినిధులకు..ప్రముఖులకు బందోబస్తుతో పాటు అన్ని పనులు వారే చూసుకవస్తే పోలీసులు బందోబస్తుతో పాటు శాంతి భద్రతల్ని పరిరక్షించటం వారిపని. రాత్రి సమయంలో పెట్రోలింగ్ డ్యూటీలు ఇలా ఒకటేమిటి అన్ని పనులతో డ్యూటీ డ్యూటీ డ్యూటీ.


అటువంటిది పశ్చిమ బెంగాల్‌ పూర్బ బర్థమాన్ జిల్లాలోని భతార్ స్టేషన్ పోలీసులు మేకలకు సేవ చేసే పని పడింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..భతార్ స్టేషన్ పోలీసులు రాత్రి సమయంలో స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారికి రోడ్డుపై నాలుగు మేకలు కనిపించాయి. ఆ మేకల యజమాని కోసం వెతికినా కనిపించలేదు. మేతకు వాటిని వదిలేశాడేమో..ఉదయం వాటిని వెతక్కుంటూ వస్తాడు కదాని వాటిని స్టేషన్ కు తోలుకొచ్చి అక్కడున్న చెట్టుకి కట్టేశారు.వాటిని మేత కూడా వేశారు.


ఆ నాలుగు మేకల్లో ఒకటి చూడి (గర్భంతో) మేక ఉంది. అక్కడున్న చెట్టుకి వాటిని కట్టేసారు. వాటికి మేత కూడా వేశారు. ఇది జరిగి వారం దాటుతున్నా మేకల యజమాని రాలేదు. అతని కోసం ఆ ప్రాంతంలో వివరాలు అడిగారు. నాలుగు మేకలు ఉన్న వ్యక్తి మీకు తెలుసా? అని కాని ఎవ్వరూ తెలీదని చెప్పారు. అలా మేకల యజమాని ఆచూకీ దొరకలేదు.


దీంతో స్టేషన్‌లోనే వాటికి ఆహారం అందించి..సంరక్షిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో చూడి మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిని చూసుకునేందుకు పోలీసులు ఓ పనివాడిని కూడా ఏర్పాటు చేశారు. పోలీసులకు చక్కగా ఆ బుజ్జి మేకపిల్లతో చక్కటి కాలక్షేపం కూడా అవుతోంది. ఆ మేకల యజమాని వచ్చి తగిన ఆధారాలు సమర్పిస్తే వాటిని అతడికి అప్పగిస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Related Posts