లిప్‌స్టిక్ వేసుకున్న తల్లిని అవమానించిన బంధువులు..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కొడుకు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Westbengle : kolkata son mother lipstick : తల్లి అంటే ప్రాణం పెట్టే కొడుకు ఎవరైనా తనను ఎన్ని అన్నా భరిస్తాడు. కానీ అమ్మను ఒక్క మాట అంటే సహంచడు. భరించడు. అటువంటిది తన తల్లిని అవమానించిన తన బంధువులకు ఓ కొడుకు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లి లిప్ట్ స్టిక్ వేసుకుందని తన అమ్మను అవమానించినందుకు ఆ కొడుకు వినూత్నంగా సోషల్ మీడియా వేదికగా దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. దీంతో సదరు బంధువులు బిత్తరపోయారు.వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పుష్పక్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. వారి బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి పిలవగా తల్లిని తీసుకుని పుష్పక్ వెళ్లాడు. ఈ కార్యక్రమానికి పుష్పక్ తల్లి చక్కగా ముస్తాబై..ఎర్రటి లిప్‌స్టిక్ వేసుకుని వచ్చింది. ఆమె లిప్ స్టిక్ వేసుకోవటం చూసిన బంధువులు ఎగతాళి చేశారు. ఈ వయస్సులో నీకు లిప్‌స్టిక్ కావల్సి వచ్చిందా? అంటూ ఈసడింపుగా మాట్లాడారు. 54ఏళ్ల వయస్సులో నీకీ సోకులేంటీ? ఇలాంటి పనులు చేయొద్దు అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. వారి మాటలకు ఆమె సంతోషంగా కాస్తా ఆవిరైపోయింది. తీవ్రంగా మనస్తాపం చెందింది.


ఆ మాటలు పుష్పక్ విన్నాడు. తల్లిని బంధువులు అవమానించడాన్ని పుష్పక్ ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. వారి మాటలు పట్టించుకోవద్దని చెబుతూ..బాధపడవద్దని తల్లిని ఓదార్చాడు. వేడుక అయిపోయాక తల్లిని తీసుకుని పుష్ప్ కూడా వారి ఇంటికి వెళ్లిపోయాడు. అదేరోజు సాయంత్రం పుష్పక్ సోషల్ మీడియాలో ఒక ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో పుష్పక్ గడ్డంతో ఉన్నాడు. కళ్లకు కాటుక పెట్టుకున్నాడు. పెదాలకు ఎర్రని లిప్‌స్టిక్ వేసుకున్నాడు. ఒక చేతిలో లిప్‌స్టిప్ పట్టుకున్నాడు. ఈ ఫొటో చూసిన పుష్పక్ బంధువర్గంలో కలకలం చెలరేగింది. ఇదేంటీ ఈ ఫోటో పంపించాడని ఆశ్చర్యపోయారు.


కానీ కింద రాసి మ్యాటర్ చదివిన సదరు బంధువులకు దిమ్మ తిరిగిపోయింది. నోట మాటరాలేదు. పుష్పక్ రాసి మ్యాటర్ ఇలా ఉంది : ‘మా అమ్మకు 54 ఏళ్లు, మా బంధువుల ఇంట జరిగే వేడుకకు అమ్మ ఎర్రని లిప్‌స్టిక్ పెట్టుకుని రావడంతో కొందరు బంధువులు అవమానకరంగా మాట్లాడారు. ఆ మాటలకు మా అమ్మ చాలా బాధపడింది. వారికి నేను ఈ సమాధానం చెప్పాలనుకుంటున్నాననీ..హలో ‘గుడ్ మార్నింగ్, త్వరగా మంచిగా మారండి’ అంటూ ఈ ఫొటో షేర్ చేశాను.


ఆ వేడుక సందర్బంలో ఒక విషయం నాకు అర్థం కాలేదు. అక్కడ మా బంధువుల పిల్లలంతా ఉన్నారు. మా అమ్మను కొంతమంది అవమానిస్తున్నా… వారెవరూ ఏమీ అనలేదు. కనీసం నోరు మెదపలేదు. ఇప్పుడు నేను గడ్డంతో ఉంటూ ఎర్రని లిప్‌స్టిక్ పెట్టుకున్నాను. తల్లులు, సోదరీమణులు, మహిళలందరికీ నా ఈ రూపాన్ని చూపిస్తున్నాను.


ఈ భద్రతలేని సమాజంలోని కొన్ని విషశక్తుల కారణంగా మన అభీష్టాలను అణచి వేసుకోవాల్సివస్తోంది’ అని రాసుకొచ్చాడు. అది చదివిన సదరు బంధువులంతా ఏమీ అనలేక నోరు మూసుకున్నారు. తల్లిని అవమానించిన వారికి కరెక్ట్ గా వినూత్న రీతిలో కౌంటర్ ఇచ్చిన పుష్పక్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. పుష్పక్ ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా..17 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.కాగా వయస్సును బట్టి మహిళలు తమ ఇష్టాలను చంపేసేకోవాలా? చిన్నపాటి లిప్ స్టిక్ వేసుకుంటేనే పరువు పోతుందా? వారి మనస్సుకు నచ్చినట్లుగా వారు ఉండకూడదా? అనే ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.

Related Tags :

Related Posts :