Published
1 month agoon
no alcohol after vaccine advisory : కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. టీకా తీసుకున్నాం కదా.. అని ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. కరోనా టీకా తీసుకున్నాక ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అందులోనూ ఆల్కాహాల్ అసలే తీసుకోవద్దని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక ఆల్కాహాల్ సేవించడంపై రష్యాకు చెందిన అడ్వైజరీ ఒక ప్రకటన జారీ చేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 45 రోజుల వరకు తప్పనిసరిగా ఆల్కాహాల్ దూరం పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇండియాలో మొదటి గ్రూపులో కరోనా వ్యాక్సిన్ కోసం ఎంపికైనవారిందరికి ఇది వర్తిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ సుభాష్ సాల్నుంకే.. ఐసీఎంఆర్ లో కోవిడ్ టాస్క్ ఫోర్సులో ఒకరు.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎవరైనా ఆల్కాహాల్ వంటి డ్రగ్స్ తీసుకుంటే.. వారిలో కరోనా ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేయదని సూచిస్తున్నారు. కానీ, 45 రోజులపాటు ఆల్కాహాల్ కు దూరంగా ఉండటం వల్ల వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి కూడా ఎలాంటి సైంటిఫిక్ స్టడీ లేదని డాక్టర్ సుభాష్ అంటున్నారు.
మద్యం సేవించి ఎలాగైతే డ్రైవ్ చేయకూడదో.. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న రోజున ఆల్కాహాల్ ముట్టరాదని కామన్ సెన్స్ స్టేట్ మెంట్ కావొచ్చు అంటున్నారు. రష్యాలో కరోనా వ్యాక్సిన్ సమర్థత వివాదాస్పదమైన సందర్భంగా అక్కడి స్థానిక మంత్రి ఒకరు.. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 45 రోజుల వరకు ఆల్కాహాల్ సేవించరాదని సూచించారు. లేదంటే.. వ్యాక్సిన్ ఇమ్యూనిటీకి అవసరమైన సమయంలో ఆల్కాహాల్ సేవిస్తే.. అది సమర్థవంతంగా పనిచేయకపోవచ్చునని పేర్కొన్నారు. తద్వారా శరీరంలో యాంటీబాడీలు తయారు కావడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
యుకె మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటర్ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మద్యపానం కోవిడ్ -19 వ్యాక్సిన్ల సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. రష్యా మంత్రి ప్రకటన తరువాత.. రష్యన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డెవలపర్లలో ఒకరైన అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్.. ప్రతి ఇంజెక్షన్ తర్వాత మూడు రోజులు మద్యం మానుకోవాలని సిఫారసు చేసినట్లు చెప్పారు. 300 గ్రాముల వోడ్కా తాగడం యాంటీబాడీ ఉత్పత్తిని అణిచివేస్తుందని మరో నివేదిక పేర్కొంది.