లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

పట్టుకున్న బంగారాన్ని ఏమి చేస్తారు ? తెల్వదంటున్న కస్టమ్స్ అధికారులు

Updated On - 10:27 am, Sun, 24 January 21

Customs officers on notice : అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, విలువైన వస్తువులను అక్రమంగా తరలిస్తుంటే..కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే..పట్టుకున్న వస్తువులను వీరు ఏం చేస్తారు ? ఎక్కడ దాచి పెడుతారు ? అనే డౌట్ అందరిలో వస్తుంటుంది. కానీ..ఎవరూ అడగలేదు. ఓ వ్యక్తికి మాత్రం సందేహం వచ్చి..ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అదే ప్రశ్నను అడిగారు. వచ్చిన సమాధానం చూసి..అతను ఆశ్చర్యపోయాడు. ఏంటా సమాధానం..అంటే..‘మా వద్ద సమాచారం లేదు’ అని.

యూఏఈ, సౌదీ అరేబియా తదితర గల్ఫ్‌ దేశాల నుంచి బంగారం, ఇతర దేశాల నుంచి పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విదేశీ కరెన్సీని కొందరు విమానాల ద్వారా అక్రమంగా హైదరాబాద్‌కు తెస్తుంటారు. పన్ను ఎగొట్టాలనే ఉద్దేశ్యంతో వీటిని అక్రమంగా తరలిస్తుంటారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ..కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పే విధంగా..కొత్త కొత్త తరహాలో ఇక్కడకు తీసుకవస్తుంటారు. కొన్ని ఘటనల్లో ఇవి బయటపడుతుంటాయి. పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, కరెన్సీ, ఇతర విలువైన వస్తువులను కస్టమ్స్‌ అధికారులు ఏం చేస్తారు? వీటిని వేలం వేస్తారా? లేక ఇతర శాఖలకు పంపుతారా? కోర్టుకు స్వాధీనం చేస్తారా? అంటూ..నగరానికి చెందిన రాబిన్‌ అనే సామాజిక ఉద్యమకారుడు శంషాబాద్‌లోని హైదరాబాద్‌ కస్టమ్స్‌ ఆఫీసుకు, సనత్‌నగర్‌లోని కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌కు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశాడు.

తన ప్రశ్నలకు కస్టమ్స్ అధికారులు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంపై రాబిన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అక్రమంగా తరలిస్తూ..పట్టుబడిన బంగారం, డైమండ్స్ అంటూ..వార్తలు వస్తుంటాయని..స్వాధీనం చేసుకున్న వాటిని ఏం చేస్తారో ప్రజలకు చెప్పకపోవడం ఏంటీ ? అంటూ ప్రశ్నిస్తున్నాడు. వస్తువుల రికార్డు నిర్వహణ సరిగా ఉందా? అని నిలదీశాడు. నిర్వహణ సరిగ్గా లేకపోతే..ఇటీవలే చెన్నైలోని సీబీఐ కస్టడీ నుంచి దాదాపు 100 కిలోల బంగారం మాయమైన తరహాలో జరిగితే ఎలా ? అని సూటిగా ప్రశ్నిస్తున్నాడు.

ప్రశ్నించిన తొమ్మిది ప్రశ్నలు :
2015 నుంచి 2020 వరకు కస్టమ్స్‌ శాఖ సీజ్‌ చేసిన వస్తువుల వివరాలు
స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏయే దేశాలవి?
2015–2020 వరకు నమోదు చేసిన కేసులు
స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏం చేస్తారు?

ప్రస్తుతం హైదరాబాద్‌ కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత?
సీజ్‌ చేసిన వçస్తువులను హైదరాబాద్‌ కస్టమ్స్‌ వేలం వేస్తుందా?
మీరు నిర్వహించిన వేలంలో విక్రయించిన పది వస్తువులు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు
వేలం సమాచారం ప్రజలకు ఎలా తెలియజేస్తారు? గత పది వేలంల గురించిన వివరాలు
హైదరాబాద్‌ కస్టమ్స్‌ శాఖ సీజ్‌ చేసిన వస్తువుల్లో ఎన్ని కస్టడీలో ఉన్నాయి? ఇతర విభాగాలు, కోర్టుకు ఎన్నింటిని అప్పగించారు?