కీసర మాజీ MRO ఆత్మహత్య.. ఆ ముందు రోజు ఏం జరిగింది?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

keesara former tahsildar nagaraj Suicide Case : అవినీతి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.అవినీతి నిరోధక శాఖ అధికారులు నాగరాజును అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడు అయిన నాగరాజు కేసుపై నెలరోజులుగా ఏసీబీ విచారిస్తోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. నాగరాజు ఆత్మహత్యను కస్టోడియల్‌ డెత్‌గా కేసుగా పోలీసులు ఫైల్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు జైలు సిబ్బందిని కూడా విచారించారు.నాగరాజు ఆత్మహత్యకు ముందు కొన్ని రోజులు ఏసీబీ అధికారుల కస్టడిలోని ఉన్నారు.. నాగరాజును ఏసీబీ విచారించిన అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? ఆ ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Posts