పాత టీవీలు, రేడియోలకు ఎందుకంత డిమాండ్.. రెడ్ మెర్క్యురీకి నిజంగానే లక్షలు, కోట్లు ఇస్తారా? రెడ్ మెర్క్యురీ అంటే ఏంటి?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

red mercury: మీ దగ్గర పాత కాలం నాటి టీవీలు, రేడియోలు ఉన్నాయా..అయితే మీరు లక్షాధికారి..అదృష్టం బాగుంటే కోటీశ్వరుడు కూడా అయినట్లే. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారం ఇది. ఇటు కోనేందుకు ముఠాలు..అటు అమ్మేందుకు జనాలు..ఈ టీవీలు, రేడియోల వేటలో ఫుల్‌ బిజీ అయిపోయారు. మరి నిజంగానే ఇది కోట్లు కురిపించే అవకాశమా..? లేదంటే కొత్త తరహా మోసమా..?

తెలుగు రాష్ట్రాల్లో పాత టీవీలు, రేడియోలకు ఫుల్ డిమాండ్:
తెలుగు రాష్ట్రాల్లో పాత టీవీలు, రేడియోల వేట.. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన డిమాండ్‌.. పల్లెలు, పట్టణాలను జల్లెడ పట్టేస్తున్న ముఠాలు.. లక్షలు, కోట్లు సైతం ఇచ్చి కొనడానికి సిద్ధం.. మరి నిజంగానే…పాత టీవీలు, రేడియోలుంటే లక్షాధికారి అయినట్లేనా! ఇన్నాళ్లు లేని డిమాండ్‌ వాటికి ఇప్పుడెలా వచ్చింది? అంతర్రాష్ట్ర ముఠాలే ఎందుకు ఆఫర్లు కురిపిస్తున్నాయి? కొత్త తరహా మోసమా? కోట్లు కురిపించే అవకాశమా? ఇంతకీ ఏమిటీ బేరం?

ఇంతకీ ఆ పాదరసంతో ఏం చేస్తారు:
అసలు ఈ పాత టీవీలు, రేడియోలకు ఎందుకంత డిమాండ్‌..? నిజంగానే రెడ్‌ మెర్క్యురీకి లక్షలు, కోట్లు విలువ చేసే కెపాసిటీ ఉందా..? ఇంతకీ ఆ పాదరసంతో ఏం చేస్తారు..? మెర్క్యురీని ఎలా పరీక్షిస్తారు..? ఆ మెర్క్యురీని సొంతం చేసుకున్న వాళ్లు…తిరిగి అంత డబ్బు ఎలా సంపాదిస్తారు..? ఈ ప్రచారంపై పోలీసుల మాటేంటి..?

రెడ్ మెర్క్యురీలో అద్భుత శక్తి ఉందనే వదంతులు:
మెర్క్యురీ..ఇది అత్యంత అరుదైన, విశిష్టమైన మూలకం. తెలుగులో పాదరసం అని పిలుస్తారు. సిన్నాబార్ అనే ఖనిజ ధాతువు నుంచి ఇది లభిస్తుంది. ఆమ్లాలతో చర్య పొందకపోవడంతో పాటుగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైన లోహం మెర్క్యురీయే. అందుకే రెడ్ మెర్క్యురీలో అద్భుత శక్తి ఉందనే వదంతులు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. ఇప్పటికీ కొంతమందిలో ఆ నమ్మకం కొనసాగుతూనే ఉంది. కొందరు రెడ్ మెర్క్యురీకి రోగాలను నయం చేసే గుణం ఉందని నమ్ముతారు.

రెడ్ మెర్క్యురీ గుప్తనిధులు, బంగారాన్ని గుర్తిస్తుందని నమ్మకం:
అలాగే దీనికి ఉన్న అత్యంత శక్తిమంతమైన అణు ధార్మిక శక్తి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ఇంకొందరు విశ్వసిస్తున్నారు. ఈ ఎర్రటి వాల్వ్‌కు లోహాలను గుర్తించే సామర్థ్యం ఉందని…ఈ వాల్వ్‌ భూమిలో పూర్వీకులు దాచిన గుప్తనిధులు, బంగారాన్ని గుర్తిస్తుందని మరికొందరు నమ్ముతున్నారు. ఇది ఉంటే శ్రీమంతులు కావొచ్చనే ఉద్దేశ్యంతో..తాజాగా ఈ ఆఫర్లు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.

వెల్లుల్లి నుంచి దూరంగా వెళ్తున్న మెర్క్యురీ:
అయితే…ఈ రెడ్ మెర్క్యురీలో మళ్లీ ఒరిజినల్స్, నకిలీవి కూడా ఉంటాయట. అందుకే దీని నాణ్యత నిర్ధారణ కోసం మూడు పరీక్షలు చేస్తుంటారు. ఆ రహస్య పరీక్షల్లో మొదటగా.. రెడ్ మెర్క్యురీ పక్కన వెల్లుల్లిని ఉంచినప్పుడు అది వేగంగా…దూరంగా వెళ్తుంది.
రెండోది.. ఆ వెల్లుల్లి ప్లేస్‌లో…బంగారాన్ని ఉంచితే అయస్కాంతంలా ఆకర్షిస్తుంది.
ఇక మూడోది..అత్యంత కీలకమైంది. అద్దంలో ఎర్ర పాదరసం కాస్త తెల్ల పాదరసం కావడం. రెడ్ మెర్క్యురీ గొట్టాన్ని అద్దం ముందు ఉంచితే…అది ఎర్రగా కాకుండా తెల్లటి ద్రవంలా కనిపించాలి. ఈ మూడు పరీక్షలు పాస్ అయితే దాన్ని…నంబర్ వన్ క్వాలిటీ రెడ్ మెర్క్యురీగా గుర్తిస్తారు.

READ  జూన్10 నుంచి బెజవాడ దుర్గమ్మ, ద్వారకా తిరుమలల్లో దర్శనాలు

కొందరు అప్పులు చేసి మరీ మెర్క్యురీ కొంటున్నారు:
అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని నమ్మిన పలువురు…ఒకరితో మరొకరు గొలుసుకట్టులా వాల్వ్‌లు సేకరించే పనిలో పడ్డారే తప్ప..ఎవరు డబ్బులు ఇస్తారు..? ఎంత ఇస్తారు..? ఎలా ఇస్తారు..? అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొందరు అప్పులు చేసి మరీ అడిగినకాడికి చెల్లించి ఇలాంటి వాల్వ్‌లను సొంతం చేసుకుంటున్నారు. తర్వాత వాటిని ఎలా విక్రయించాలి..? ఎవరికి విక్రయించాలన్న విషయం తెలియక

రైస్‌పుల్లింగ్‌ తరహా మోసమంటున్న పోలీసులు:
ఇక…ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని, దీని వెనక భారీ మోసం దాగి ఉంటుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇది కూడా రైస్‌ పుల్లింగ్‌ తరహా మోసమని స్పష్టం చేస్తున్నారు. వీటిని చూపి గుప్త నిధులు తవ్విస్తామని చెప్పినా నమ్మవద్దని సూచిస్తున్నారు. ఇలాంటివి ప్రచారం చేసే ముఠాలు నిధుల తవ్వకం పేరిట డబ్బులు దోచుకుంటాయని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా…ఈ ప్రచారాలతో తుప్పుపట్టిన టీవీలు, రేడియోల ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. నిజమో..కాదో తెలుసుకోకుండానే ఈ ఊబిలోకి దిగుతున్న వారి పరిస్థితి చివరకు ఏం అవుతుందో చూడాలి.

Related Posts