చిన్న ఐఫోన్ iPhone 12 Mini వచ్చేస్తోంది.. ఎప్పుడు లాంచ్? ఫీచర్లు.. ధర ఎంతంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

iPhone 12 Mini:  ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి మరో కొత్త ఐఫోన్ లైనప్ రాబోతోంది.. కొత్త ఐఫోన్ 12 మినీ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆపిల్ షెడ్యూల్ ప్రకారం ఈ సెప్టెంబర్ నెలలోనే లాంచ్ కావాల్సి ఉంది.. కానీ, వచ్చే అక్టోబర్ నెలలో అత్యంత చిన్నదైన iPhone 12 Mini స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసేందుకు ఆపిల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఈ ఏడాదిలో కొత్త ఐఫోన్లపై అనేక రుమర్లు వచ్చాయి.. ఐఫోన్ 12 లైనప్ ఫోన్లలో చిన్న ఐఫోన్ రాబోతోందంటూ ఇప్పుడు మరో కొత్త లీక్ రివీల్ చేసింది. వచ్చే జనరేషన్ ఐఫోన్లలో iPhone 12 Mini అతి చిన్నదైన ఫోన్‌‌గా రాబోతోంది. ఆపిల్ iPhone 12 Mini ఫోన్ ఎప్పుడు లాంచ్ కాబోతోంది? దీని ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? ఫోన్ ధర మార్కెట్లో ఎంత ఉండొచ్చు అనే వివరాలపై ఆసక్తి నెలకొంది.ఆపిల్ iPhone 12 ‘Mini’ అనే పేరుతో చిన్నదైన ఐఫోన్ ప్రవేశపెడుతోంది. ఈ కొత్త ఐఫోన్ మూడు వేరియంట్లలో రాబోతోంది.. ఐఫోన్ iPhone 12 Mini ఒకటి.. మరో రెండు వేరియంట్లు iPhone 12 Pro Max, iPhone 12/12 Pro. ఇప్పటివరకూ iPad Mini, iPod Mini, Mac Mini పాపులర్ డివైజ్‌ల్లోనూ మినీ పేరుతో రిలీజ్ చేసింది ఆపిల్.. ఇప్పుడు ఐఫోన్లలోనూ చిన్నదైన స్ర్కీన్ ఉండే స్మాలెస్ట్ ఐఫోన్ డివైజ్ తీసుకొస్తోంది.iPhone 12 Mini’s release date and how much will it cost

ధర ఎంతంటే? :
ఈ ఏడాదిలో ఆపిల్ కంపెనీ మొదటిసారి 5G iPhones లాంచ్ చేస్తోంది. కానీ, ఈ iPhone 12 Mini ఐఫోన్లో మాత్రం 4G-Only మోడల్ ఉండే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ లేదు. కానీ, 4G ఓన్లీ మోడల్ చాలా బెటర్ అనే టాక్.. సూపర్ ఫాస్ట్ 5G నెట్ వర్క్ కనెక్టవిటీ కారణంగా iPhone 12 Pro, iPhone 12 Pro Max డివైజ్‌ల ధర 100 డాలర్లపైమాటే ఉండొచ్చు.. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. iPhone 12 Mini ప్రారంభ ధర 699 డాలర్లు (రూ.51,500) ఉండొచ్చు.ఫీచర్లు, స్పెషిఫికేషన్లే ఎట్రాక్షన్…  :
బడ్జెట్ ఐఫోన్లలో ఐఫోన్ 12 మినీ డివైజ్ అల్యూమినియంతో డిజైన్ ఉండనుంది. లేటెస్ట్ ఆపిల్ సిలికా్ A14 Bionic Chipset టెక్నాలజీతో రానుంది. OLED స్ర్కీన్, డ్యుయల్ కెమెరా సెటప్, స్మాలర్ నాచ్, ఐప్యాడ్ ప్రో మాదిరి డిజైన్ ప్లాటర్ అంచులు కలిగి ఉంటుంది. దీంతో ఛార్జర్ రాదంట.. సపరేటుగా కొనుకోవాల్సి ఉంటుంది. లాంచ్ ఎప్పుడంటే? :
ఆపిల్ iPhone 12 Mini ఎప్పుడు లాంచ్ చేస్తుందో కచ్చితమైన తేదీపై క్లారిటీ లేదు. కొన్నిరోజుల క్రితం అక్టోబర్ 12న ఐఫోన్ 12 లాంచ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉందని పలు రిపోర్టులు వెల్లడించాయి. లాంచ్ అయితే మాత్రం iPhone 12, iPhone 12 Mini వేరియంట్లు అక్టోబర్ ఆఖరులో సేల్ ప్రారంభ కానుండగా.. Pro Models మాత్రం నవంబర్ నెలలో సేల్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

READ  మీకు తెలుసా: ఫ్రీ అన్ లిమిటెడ్ వాయీస్ కాల్స్ 24 గంటలు మాత్రమే

Related Posts