మీది ఏ బ్లడ్ గ్రూపు తెలుసా? ఎలా గుర్తించాలి?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

most common blood group type : ప్రపంచంలో మానవ జనాభాలో అత్యంత సాధారణ బ్లడ్ గ్రూపు ఏంటో తెలుసా? మీ శరీరంలో ప్రవహించే రక్తం ఏ బ్లడ్ గ్రూపు తెలుసా? ఇంతకీ బ్లడ్ గ్రూపు ఎలా గుర్తించాలి? అందరి మనుషుల్లో ఒకే రకమైన రక్తాన్ని ఎక్కించలేమా? రక్తం లేకుండా మనిషి శరీరం పనిచేస్తుందా? మానవ శరీర వ్యవస్థను నడిపిస్తున్న రక్తం పాత్ర ఏంటి? ఇలాంటి మరెన్నో సందేహాలకు సమాధానం దొరకాలంటే ఇది చదవాల్సిందే..అందరిలో ప్రవహించే రక్తం ఒకే రంగులో ఉంటుంది. మనుషులు, జంతువుల్లోనూ రక్తం ఒకే రంగులో ఉంటుంది.. రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ లేదా హిమోగ్లోబిన్ ప్రోటీన్ ఉంటుంది. దీని కారణంగా రక్తం ఎర్రగా కనిపిస్తుందని చిన్నప్పుడే చదువుకుని ఉంటారునుకోండి.. శరీరంలో రక్తం లేకుంటే మానవ శరీరం వెంటనే పనిచేయడం ఆగిపోతుంది. రక్తం ఎర్రగా ఉన్నప్పటికీ అందరిలోనూ ఒకేలా ఉండదు.. రక్తంలో అనేక గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన బ్లడ్ గ్రూపు ఉంటుంది.శరీరంలో ఎప్పుడైనా ఒకే రకమైన బ్లడ్ గ్రూపు ఉండాలి. లేదంటే రక్తం గడ్డకట్టిపోయి మరణం సంభవిస్తుంది. రక్తం ఎవరికైనా ఎక్కించాల్సి వస్తే.. వారిలో ప్రవహించే బ్లడ్ గ్రూపు మాత్రమే ఎక్కించాలంటారు. సాధారణంగా చాలామందిలో బ్లడ్ గ్రూపులు ఒకేరకంగా ఉంటాయి. ఇందులో మొత్తంగా 8 బ్లడ్ గ్రూపులు (O+, O-, A+, A-, B+, B-, AB+, AB-) ఉంటాయి. బ్లడ్ గ్రూపు రకాల్లో ఏది కామన్ బ్లడ్ గ్రూపు.. అసలు బ్లడ్ గ్రూపు ఏంటి? ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..కామన్ బ్లడ్ గ్రూపు ఏంటి? :
అత్యంత సాధారణమైన బ్లడ్ గ్రూపు ఏంటంటే? అది ‘O’ బ్లడ్ గ్రూపు. ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో ‘O’ బ్లడ్ గ్రూపు ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ రెండు రకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ‘O(+)’ బ్లడ్ గ్రూపు.. ‘O(-)’ బ్లడ్ గ్రూపు అని ఉంటాయి.ఇందులో O(-) నెగటివ్ బ్లడ్ గ్రూపును యూనివర్శల్ డోనర్ బ్లడ్ గ్రూపు అని పిలుస్తారు. అంటే.. ఈ రకం రక్తాన్ని అన్ని బ్లడ్ గ్రూపుల వారికి ఎక్కించవచ్చు. అన్ని రకాల గ్రూపుల రక్తానికి సరిగ్గా సరిపోతుంది. అందుకే దీనికి (O-negative blood) యూనివర్శల్ డోనర్ (universal donor) అని పేరొచ్చింది. దాదాపు యూకే సగం మంది జనాభాలో 48 శాతం మంది ‘O’ బ్లడ్ గ్రూపు ఉన్నవారే ఉన్నారు. ఆస్పత్రిల్లో ఎక్కువగా అవసరమయ్యే బ్లడ్ గ్రూపుల్లో O బ్లడ్ ఎక్కువగా అవసరం ఉంటుంది. ఈ రెండు రకాలు అత్యంత అవసరమైన బ్లడ్ గ్రూపులుగా చెబుతారు. ఎలాంటి బ్లడ్ గ్రూపు వారికైనా ఈ రకం బ్లడ్ గ్రూపు సరిపోతుంది.

READ  ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నారా.. అయితే ఒబెసిటీ కన్ఫామ్

బ్లడ్ గ్రూపులు ఎన్ని రకాలు? అవేంటి?
ఎర్ర రక్త కణాలతో నిండి ఉంటుంది.. తెల్ల రక్త కణాలు.. ప్లేట్ లేట్స్ ద్రావణాన్ని ప్లాస్మా అంటారు. మీ బ్లడ్ గ్రూపును మీ రక్తంలోని యాంటీబాడీలు, యాంటిజెన్స్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. బ్లడ్ గ్రూపు రకాల్లో ప్రధానంగా 4 బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. అందులో A, B, AB, O.. మీలో బ్లడ్ గ్రూపు అనేది జన్యువుల ఆధారంగా గుర్తిస్తారు.అంటే మీకు వారసత్వంగా మీ తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది. ప్రతి గ్రూపులోనూ RhD పాజిటివ్ లేదా RhD నెగటీవ్ అని రెండు ఉంటాయి. ఇలా మొత్తంగా 8 రకాల బ్లడ్ గ్రూపులు ఉన్నాయన మాట.. ఇందులో మొత్తంగా 8 బ్లడ్ గ్రూపులు (O+, O-, A+, A-, B+, B-, AB+, AB-) ఉంటాయి. సాధారణంగా చాలామందిలో బ్లడ్ గ్రూపులు ఒకేరకంగా వేర్వేరుగానూ ఉంటాయి.

కరోనా మరణ ముప్పు ఏ బ్లడ్ గ్రూపు వారిలో ఎక్కువ? :
కరోనావైరస్ ప్రభావం అధికంగా ఏ బ్లడ్ గ్రూపువారిలో ఎక్కువగా ఉంటుందంటే? కొత్త పరిశోధన ప్రకారం.. బ్లడ్ గ్రూపుల్లో A, AB బ్లడ్ గ్రూపుల వారికి కరోనావైరస్ ముప్పు అధికంగా ఉంటుంది. ఈ రకం రక్తం ఉన్నవారిలో కరోనా తీవ్ర లక్షణాలతో పాటు మరణించే అవకాశాలెక్కువగా ఉంటాయి.అదే మీరు O బ్లడ్ గ్రూపుకు చెందినవారు అయితే వీరికి కరోనా సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. కరోనా వైరస్ సోకిన O గ్రూపువారిలో కరోనా తీవ్ర లక్షణాలు తక్కువ ముప్పు (ఆర్గాన్ ఫెయిల్యూర్, మరణం సంభవించడం) అవకాశం కూడా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

మీలో బ్లడ్ గ్రూపు ఏంటి? ఎలా గుర్తించడం? :
మీ బ్లడ్ గ్రూపు ఏంటి? ఎలా గుర్తించాలంటే.. మీ రక్తంలో ఉండే ఎర్ర కణాల్లో వేర్వేరు యాంటీబాడీ సొలుష్యన్స్‌తో కలిసి ఉంటాయి. అంటే.. రక్తంలో ఎక్కువగా యాంటీ-B యాంటీబాడీలు ఉన్నాయా? రక్త కణాల్లో ఎక్కువగా B యాంటీజెన్స్ ఉంటే.. మాత్రం మీ బ్లడ్ గ్రూపు B అనమాట.. ఒకవేళ మీ రక్తంలో యాంటీ-A లేదా యాంటీ-B యాంటీబాడీలకు రియాక్ట్ కావడం లేదంటే.. మీ బ్లడ్ గ్రూపు ‘O’ అనమాట.

బ్లడ్ గ్రూపుల రకాలను నిర్ధారించడానికి అనేక రకాల టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరికైనా రక్తాన్ని దానం చేస్తున్నవారిలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి రక్తాన్ని ఎక్కించాలంటే.. మీ రక్తం ఏ బ్లడ్ గ్రూపుకుచెందినదో టెస్టు చేయాల్సి ఉంటుంది. ABO, RhD యాంటీజెన్లతో నిండి ఉండాలి. రక్తదానం చేసే వ్యక్తిలోని ABO, RhD యాంటీజెన్లతో ఎలాంటి రియాక్షన్ లేనప్పుడు మాత్రమే ఒకరి రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం సాధ్యపడుతుంది.తప్పుగా బ్లడ్ గ్రూపును ఇతరులకు ఎక్కిస్తే ప్రాణంతకమా?:
ఒక వ్యక్తిలోని బ్లడ్ గ్రూపునకు సరిపోయే బ్లడ్ గ్రూపు రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. అప్పుడే శరీరంలో రక్తం సాఫీగా సాగుతుంది. లేదంటే రక్తం గడ్డకట్టి మరణం సంభవించే ప్రమాదం ఉంది. ABO గ్రూపు తప్పుగా ఇచ్చినప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది. ఒకరి బ్లడ్ గ్రూపు B అనుకుంటే.. వారికి A బ్లడ్ గ్రూపు ఎక్కిస్తే.. వారిలోని యాంటీ-A యాంటీబాడీలు గ్రూపు A కణాలపై దాడి చేస్తాయి.

READ  Airtel Xstream బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్లు.. ఈ రెండు కొత్త ప్లాన్లపై Amazon Prime సబ్ స్ర్కిప్షన్

అందుకే బ్లడ్ గ్రూపు B వారికి ఎప్పుడూ కూడా A గ్రూపు బ్లడ్ ఇవ్వకూడదు. అదే O బ్లడ్ గ్రూపు ఎర్ర రక్త కణాల్లో ఎలాంటి A లేదా B యాంటీజెన్స్ ఉండవు.. అందుకే ఈ O గ్రూపు వారు ఏ బ్లడ్ గ్రూపు వారికైనా తమ రక్తాన్ని ఇవ్వొచ్చు..

Related Posts