Rapist Psychology: రేపిస్ట్ మనస్తత్వం ఏంటి? మృగాల్లా ఎందుకు ప్రవర్తిస్తుంటారు? అందరిలా ఆలోచించరా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rapist Psychology : మహిళలపై అత్యాచారానికి పాల్పడటమనేది సహించరాని నేరం.. అలాంటి ఆలోచన రావాలంటేనే భయం పుట్టే పరిస్థితులు ఉండాలి. అప్పుడు మహిళలపై అత్యాచారం చేయాలనే ఆలోచనే రాదు.. మహిళలపై అత్యాచారం చేయాలనే ఆలోచన పురుషుల్లో ఎందుకు వస్తోంది.. రేపిస్టులు ఎందుకిలా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు? అసలు రేపిస్టుల ఆంతర్యం ఏంటి? రేపిస్టుల సైకలాజికల్ బిహివేయర్ ఎలా ఉంటుంది? అనేక క్లిష్టమైన ప్రశ్నలతో కూడుకున్నది. ఒక వ్యక్తి రేపిస్టుగా మారడానికి దాని వెనుక అనేక అంశాల ప్రభావం ఉంటుందని అంటున్నారు సైకాలిజిస్టులు..లైంగిక వేధింపులకు పాల్పడేది ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు. వారిలో నేరాలకు పాల్పడటానికి నిర్దిష్టమైన గుణం అంటూ ఉండదు.. 1970లో యుఎస్ క్లినికల్ సైకాలజిస్ట్, డాక్టర్ శామ్యూల్ డి. స్మితిమాన్ 50 మంది పురుషులను ఇంటర్వ్యూ చేశారు. ఈ పురుషులందరివి విభిన్న నేపథ్యాలు, సామాజిక స్థితిగతులే కాదు… భిన్నమైన వ్యక్తిత్వాలు, మనస్తత్వాలకు చెందినవారిగా కనిపిస్తున్నారని చెప్పారు. వారంతా అనాలోచితంగానే ఇలాంటి లైంగిక నేరాలకు పాల్పడ్డారో తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.

అత్యాచారం చేయాలనే ఉద్దేశాలు మారుతూ ఉండొచ్చు.. అయినాసరే.. రేపిస్టులలో కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో ఒకటి సానూభూతి లేకపోవడం ( lack of empathy), రెండోది నార్సిసిజం.. అధిక ఆత్మగౌరవం  (narcissism), మూడోది మహిళల పట్ల శత్రుత్వ భావాలు కలిగి ఉంటారు.

మగాళ్లమనే ఆధిపత్యమే :
అమెరికాలోని Tennesseeలోని సౌత్ యూనివర్శిటీలో psychology రీసెర్చ్ ప్రొఫెసర్ Sherry Hamby చెప్పిన ప్రకారం.. లైంగిక వేధింపులు, లైంగిక సంతృప్తి లేదా లైంగిక ఆసక్తి అనే అంశాలు అసలు కానే కాదన్నారు.. మహిళలపై ఆధిపత్యం గురించి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అదే మహిళలపై అత్యాచార సంస్కృతిని ప్రోత్సహిస్తుందని అన్నారు.అత్యాచారం.. లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో ఎక్కువగా యువకులే ఉన్నారని ఆమె చెప్పారు. తన జీవితంలో లైంగిక అనుభవం ఉంటే.. మగాడిగా ముద్ర వేస్తుందనే భావన కావొచ్చు.. తోటిమగవారితో సామాజిక హోదా ఉంటుందనే ఆలోచన కావొచ్చు.. ఈ రకమైన తోటిమగవారి నుంచి ఒత్తిడితో పురుషులను లైంగిక నేరస్థులుగా మారుస్తుందని తాను నమ్ముతున్నానని Sherry Hamby చెప్పారు. ఎందుకంటే చాలామంది మగాళ్లు తమ తోటి పురుషులకు లైంగిక అనుభవం ఉంటేనే గుర్తిస్తారనే భావన ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

అత్యాచారం అనేది.. లైంగిక కోరిక లేదా హింసనా? :
అత్యాచారం అనేది.. ఒక ప్రవర్తనా లేదా మానసిక రుగ్మత కాదని గుర్తించాలి. అది తీవ్రమైన నేరంగానే నిర్ధారించాలి. కొంతమంది రేపిస్టులకు మానసిక రుగ్మత ఉన్నప్పటికీ.. అత్యాచారానికి మహిళలను బలవంతం చేసే వంటి రుగ్మత లేదంటున్నారు సైకలాజికల్ నిపుణులు. Evolutionary biologist రాండి థోర్న్‌హిల్, evolutionary anthropologist క్రెయిగ్ పామర్, డాక్టర్ హాంబికి భిన్నంగా అభిప్రాయపడ్డారు. రేపిస్టుల్లో అత్యాచారం వెనుక అసలు ఉద్దేశం వాస్తవానికి శృంగారమని గట్టిగా నమ్ముతున్నారు.A Natural History of Rape: Biological Bases of Sexual Coercion అనే పుస్తకంలో రేపిస్ట్ సైకాలజీపై ప్రచురించిన సైన్స్ జర్నల్ నేచర్‌లో తీవ్రంగా విమర్శలు వచ్చాయి.వాస్తవానికి, చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు, మనస్తత్వవేత్తలు, స్త్రీవాద కార్యకర్తలు అత్యాచారానికి అధికారం, హింస సమస్యలతో సంబంధం ఉందని అభిప్రాయపడ్డారు. అత్యాచారం అనేది కామం కాదు.. మహిళలను నియంత్రించడానికి వారిపై ఆధిపత్యం చెలాయించటానికి ప్రేరేపించేలా ఉందని అంటున్నారు. మహిళల పట్ల ద్వేషం, శత్రుత్వంతో కూడుకున్న చర్యగా అభిప్రాయపడ్డారు.

READ  'పాకిస్తాన్ ముస్లింల విషయంలో ద్వంద వైఖరి వహిస్తోంది'

మహిళల పట్ల శత్రుత్వం :
పురుషుల లైంగిక అవసరాలను తీర్చడానికి రేపిస్టులు తరచూ మహిళలను శృంగార వస్తువులుగా చూస్తారు. వారిపై తప్పుడు అభిప్రాయాలతో ఉంటారు. ఒక మహిళ నో అని చెబితే, ఆమె నిజంగా అవును అని అర్ధంగా ఒక రేపిస్ట్ భావించవచ్చు.యుఎస్ డెట్రాయిట్‌లోని వేన్ స్టేట్ యూనివర్శిటీలో సోషల్ సైకాలిజిస్ట్ ఆంటోనియా అబ్బే ఇలా చెప్పారు.. ఒక వ్యక్తి.. ఆ స్త్రీని పొందడం చాలా కష్టమని నమ్ముతున్నాడు. మరొకరు చాలా మంది మహిళలు మొదట చాలా సార్లు ‘నో’ అని చెప్తారు. ఇలాంటి సందర్భాల్లో తమలోని రేపిస్టు ప్రవర్తనకు కారణం అవుతుందని అబ్బే అభిప్రాయపడ్డారు.

రేపిస్ట్‌లు ఎన్ని రకాలు :
రేపిస్ట్ ఎన్ని రకాలంటే.. అనేకం అని చెప్పొచ్చు.. మద్యం మత్తులో మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం.. ఆత్మ నియంత్రణ కోల్పోయి.. లైంగిక సంతృప్తి కోసం ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడే రేపిస్టులు ఒక రకంగా చెప్పొచ్చు.. మరొక రకం సాడిస్టిక్ రేపిస్ట్.. తనను ప్రేరేపించిన బాధితులను అవమానించడంతో పాటు వారిని హింసించి అత్యాచారం చేయాలనే భావన కలిగి ఉంటారు.ప్రతీకార రేపిస్ట్.. వీరిలో.. కోపం, దూకుడు నేరుగా మహిళలపై అత్యాచారానికి పాల్పడుతుంటారు. ఎందుకంటే గతంలో తమను మహిళలు బాధించారని, తిరస్కరించారని లేదా అన్యాయం చేశారని భావిస్తుంటారు.. తమ చర్యలను  స్వేచ్ఛగా సమర్థించుకునేందుకు అంగీకరిస్తుంటారు. అత్యాచారాలను ఒప్పుకునే రేపిస్టులు తరచూ తాము చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పుడూ సాకులు వెతకడానికే ప్రయత్నిస్తుంటారు.

Related Posts