లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

బంగారం, డబ్బు జోలికి అస్సలు వెళ్లరు.. కంటైనర్లే టార్గెట్.. డేంజరస్ కంజర్ భట్ గ్యాంగ్ లక్ష్యం ఏంటి?

Published

on

kanjarbhat gang: హైదరాబాద్‌పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా.. వరసబెట్టి జరుగుతోన్న చోరీలు.. రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి.. ఇంతకీ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి కారణం ఏంటి..

డబ్బూ దస్కం జోలికి పోదు.. ఏకంగా కంటైనర్లకి కంటైనర్లే లేపేస్తుంది:
పని మనుషులుగా చేరతారు, ఎంతో నమ్మకంగా ఉంటారు, అదను చూసి యజమాని ఇంట్లో సొత్తు దోచుకెళ్తారు.. ఇదీ నేపాలీ గ్యాంగ్స్ తీరు. ఇది కాకుండా ఇంకో క్రిమినల్ బ్యాచ్ ఉంది. ఇది డబ్బూ దస్కం జోలికి పోదు.. ఏకంగా కంటైనర్లకి కంటైనర్లే లేపేస్తుంది. ఎవరైనా తమ దారికి అడ్డం వస్తే ఖతం చేసి పారేస్తుంది..ఇంత కిరాతకమైన గ్యాంగ్ ఇది.

అంత తొందరగా దొరకరు….సరుకు మాయం చేస్తారు..పాదరసంలా జారిపోతారు
కంజర్ భట్ గ్యాంగ్ స్పెషాల్టీనే వేరు.. అంత తొందరగా దొరకరు….సరుకు మాయం చేస్తారు..పాదరసంలా జారిపోతారు.. బంగారమో..డబ్బో..దస్కమో ఎత్తుకెళ్లదీ గ్యాంగ్.. అంతా ఇండస్ట్రీ మేడ్ సరుకే టార్గెట్. జనరల్‌గా ఏ ఇండస్ట్రీ అయినా తమ ఉత్పత్తులను లారీల్లో దేశమంతా పంపిస్తుంది. సరిగ్గా అలాంటి లారీలే టార్గెట్ చేసుకుంటాయ్ మధ్యప్రదేశ్‌లోని కంజర్ భట్ గ్యాంగ్.. లారీలు బయలుదేరింది మొదలు వెంటాడుతారు.. సాధారణంగా రెండు మూడు బండ్లతో దాన్ని వెంబడిస్తారు. నిర్మానుష్యంగా ఉన్న చోట తమ వాహనాలతో సరుకు ఉన్న బండిని ముట్టడిస్తారు. డ్రైవర్‌ని స్పృహ తప్పేలా చేయడమో, చంపడమో చేస్తారు.

ఇక్కడ చోరీ చేసి నేపాల్, బంగ్లాదేశ్ లో విక్రయిస్తారు:
ఆ తర్వాత గ్యాంగ్ మెంబర్లు వెంటనే లారీలోని సరుకుని తమ బళ్లలోకి మార్చేసి జంప్ అవుతారు..మెదక్ జిల్లా మూసాపేట దగ్గర ఇలానే 2020 సెప్టెంబర్ లో …. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తోన్న లారీ నుంచి 2వేల 400 ఫోన్లు మాయమైపోయాయ్. భోజనం కోసం లారీ దిగిన డ్రైవర్‌కి ఆ విషయం కూడా తెలీదు. ఇక ఈ ఫోన్లను మన దగ్గర అమ్మరు.. ఇక్కడ సిమ్ ఆన్ చేస్తే ఫోన్లు ఐఎంఈఐ నంబర్ ద్వారా ట్రాక్ అవుతాయి. ఆ నంబర్ ఉన్న ఫోన్ పని చేయకుండా బ్లాక్ చేయొచ్చు. అందుకే వీటిని నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అమ్ముతారు. అక్కడికి వెళ్లిన ఫోన్లను మన సిస్టమ్స్ ట్రాక్ చేయలేవు మరి. అంటే ఈ కిరాతక కంజర్ భట్‌ దొంగలకు ఎన్ని తెలివితేటలో చూడండి.

* చెన్నై-కోల్‌కతా హైవే.. 2019 ఫిబ్రవరి.. ఓ తెల్లవారుజామున శ్రీసిటీ నుంచి బయల్దేరిన ఒక కంటైనర్ లారీలోని 5వేల స్మార్ట్ ఫోన్లు ఇలానే మాయం అయ్యాయ్.
* 2020 ఆగస్టు 25.. శ్రీపెరుంబుదూరు నుంచి ముంబైకి లారీ వెళ్తోంది. చిత్తూరు జిల్లాలో నగరి ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని దొంగలు చుట్టుముట్టారు. డ్రైవర్‌ని కొట్టి రోడ్డు పక్కన వదిలేశారు. లారీ తీసుకుపోయారు. మొత్తం 8 బాక్సుల్లో ఉన్న 7వేల 500 ఫోన్లు దోపిడీ అయ్యాయి.

దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులకు చెందిన దొంగల ముఠాల గురించి విచారించడం పోలీసులు మొదలుపెట్టారు. పెద్దగా లాభం లేదు కానీ, తవ్వే కొద్దీ ఇదే తరహాలో, ఒకే బృందం చేసిన మరో మూడు నేరాలు బయటపడ్డాయి. దీంతో మధ్యప్రదేశ్‌లోని రేవాలోని కంజర్ భట్ ముఠాపై అనుమానంతో కొన్ని నెలలపాటు నిఘా పెట్టారు..చివరికి సక్సెస్ సాధించారు.

బ్రిటీషర్ల హయాం నుంచే దొంగతనాలను ఓ వృత్తిగా:
ఇంతకీ ఈ కంజర్ భట్ ముఠా ఏంటంటే కంజర్ అనేది ఓ ఆటవిక తెగ ..బ్రిటీషర్ల హయాం నుంచే దొంగతనాలను ఓ వృత్తిగా ఎంచుకున్న ఘనత వీరిది..చోరీ చేయాలనుకున్నప్పుడు కొంతమంది ముఠాలుగా ఏర్పడి తాము ఎంచుకున్న ప్రాంతాల్లో మకాం పెడతారు.. దాదాపు నెల రోజులు తమకి అనుకూలమైన సమయం వచ్చేవరకూ ఆగి ..అప్పుడు తమ పని మొదలు పెడతారు..ఎక్కడైతే దోపిడీలు చేయాలని భావిస్తారో అక్కడికి ముందే ఓ ముఠా చేరుకుంటుంది. పరిసర ప్రాంతాలను, పరిస్థితులను, సెక్యూరిటీ ఎలా ఉందో స్కాన్ చేస్తారు. భారీ కంటైనర్లలో ఏం తీసుకెళ్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అందులో ఎన్ని కోట్ల సొత్తు ఉంటుందో అన్ని వివరాలను సేకరిస్తారు.

పక్కాగా ప్లాన్ చేసి చోరీ:
అంతా ఓకే అనుకుంటే మిగతా సభ్యులకి కబురు పెడతారు. చోరీలకు ఎక్కడా సొంత వాహనాలు వాడరు. రెంట్‌కి తీసుకుని బయలుదేరుతారు. ఏ టైమ్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతాయో పక్కాగా తెలుసుకుని హైవేలపై కాపుగాస్తారు. జనాలు, వాహనాల రాకపోకలు తక్కువగా ఉండే ఏరియాల్లో మకాం వేసి కంటైనర్లను అడ్డగిస్తారు. డ్రైవర్‌తో పాటు సిబ్బందిపై దాడి చేస్తారు. మారణాయుధాలతో బెదిరిస్తారు. కాదూ కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే చంపేందుకు కూడా వెనకాడరు. కంటైనర్‌ని కొద్దిదూరం తీసుకెళ్లి.. తమ వాహనం రాగానే సరుకునంతా అందులోకి డంప్ చేస్తారు.

పోలీసులకు దొరికినా గ్యాంగ్ లోని ఇతరుల పేర్లు చెప్పరు:
అంతేకాదు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తమ సరుకు కొనడానికి డీలర్లను.. బ్రోకర్లను కూడా సెట్ చేసుకుంటారు.. అలా తమ ప్లాన్ సక్సెస్ కాగానే జంప్ జిలానీ మంత్రం పఠిస్తారు..వీళ్లలో ఏ ఒక్కరు దొరికినా మిగిలిన వాళ్ల పేర్లు చెప్పడం ఉండదు..అందుకే పోలీసులకు ఈ గ్యాంగ్ పని పట్టడం చాలా కష్టమైంది..తమ దొంగతనాలకి అడ్డం వస్తే..సఫా చేసేస్తారు.. చాలా రోజుల తర్వాత కంజర్‌భట్ బ్యాచ్ అలజడి తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు మెదక్‌లో ఒకే తరహా కంటైనర్ల దోపిడీకి పాల్పడి.. ఖాకీలకు తలనొప్పిగా మారారు.

ఎక్కడా చిన్న క్లూ కూడా వదలరు:
ఎక్కడా కేసుకు చిన్న క్లూ కూడా వదల్లేదు నిందితులు. నెల్లూరు కేసు ఛేదించడానికి దాదాపు 9 నెలలు పట్టింది. ఈ క్రమంలో మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అక్కడి భాష, అక్కడి పోలీసులు, అక్కడి ఇన్ఫార్మర్లు, అక్కడి సామాజిక పరిస్థితులూ అన్నీ మన పోలీసులకు ఓ సవాల్. మొత్తానికి అన్నీ సర్దుకునో, చక్కదిద్దుకునో, అనుకున్నది సాధించారు.

ఒక్క దొంగతనంతో లైఫ్ సెటిల్ అవ్వాలి:
ఒక్క దొంగతనంతో లైఫ్ సెటిల్ అవడమే కంజర్ భట్ గ్యాంగ్ కంటైనర్లపై ఫోకస్ పెట్టడానికి కారణంగా చెప్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో వేర్వేరు ముఠాలు ఇక్కడ మకాం వేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు కీలక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా
వ్యవహరిస్తే వెంటనే తమని సంప్రదించాలని సూచిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *