కొలీగ్ గురించి శృంగార కలలొస్తే తప్పా? సైన్స్ చెబుతున్న అర్ధమేంటి?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శృంగారపు కలలు కంటున్నారా? ఒక్కొక్కరు తమకు ఇష్టమైన వాళ్లతో రొమాన్స్ చేస్తున్నట్టు కలలు కంటుంటారు. అదే నిజమైతే బాగుండూ అని కోరుకుంటుంటారు. కామ కోరికలు బుసలు గొడుతున్నవారిలో ప్రత్యక్షంగా వారితో రొమాన్స్ చేయలేక.. కలల్లోనే ఆ శృంగార సుఖాన్ని ఆనందిస్తుంటారు. కౌమర దశలో ఎక్కువగా ఈ ఫీలింగ్స్ ఉంటాయని అంటున్నారు సెక్సాలిజిస్టులు..

అదే.. ఆఫీసుల్లోనూ చాలామంది తమ తోటి ఉద్యోగుల గురించి ఎక్కువగా కలలు కనేస్తున్నారంట.. రొమాన్స్ చేస్తున్నట్టుగా కలలు వస్తున్నాయని చెబుతున్నారు. ఆఫీసుల్లో కొలీగ్ గురించి శృంగార కలలు రావడం తప్పా? అంటారా? అసలు సైన్స్ దీనికి ఎలాంటి అర్థాన్ని చెబుతోంది.. సెక్సాలిజిస్టులు ఇలాంటి కలలు రావడాన్ని ఏ విధంగా విశ్లేషిస్తున్నారో తెలుసుకుందాం..



వాస్తవానికి, ఆఫీసుల్లో కలలు రావడం చాలా సాధారణం. చాలా ఒత్తిడితో కూడుకున్నవి పని కూడా.. ఇందులో ఐదు సాధారణ ఆఫీసుల డ్రీమ్‌ల గురించి సైకిక్ వరల్డ్ పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించింది – మీరు ఆఫీసులో దుస్తులు లేకుండా ఉన్నట్టుగా కలలు కంటుంటారు. మరికొందరిలో సహోద్యోగితో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్టు కలలు కంటున్నామని చెప్పుకొచ్చారు.

సహోద్యోగితో లైంగిక సంబంధం గురించి కలలు కనడం తప్పేమి కాకపోవచ్చు అంటోంది సైన్స్.. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండానే వచ్చే కలలు అవి.. వాస్తవం కాదు.. సైకిక్ వరల్డ్‌లోని కలలకు సంబంధించిన నిపుణులు ఆఫీసుల్లో కలలకు అర్థం ఏంటో వివరించారు.



మీరు తిరిగి కార్యాలయానికి వెళ్ళే ముందు రాత్రి మంచి నిద్ర పొందవచ్చు. ఆఫీసు కలల్లో ఎక్కువగా ఆలస్యం కావడం / పని ఉందని మర్చిపోవడం (64%) ఉన్నారు. (58%) నగ్నంగా ఉన్నామని చెప్పారు. (47%) సహోద్యోగితో లైంగిక సంబంధం కలిగి (42%), టాయిలెట్ / లిఫ్ట్ (38%) లో చిక్కుకున్నామని ఇలా మొత్తం 2,473 మంది తమ కలల గురించి చెప్పినట్టు బ్రిట్స్ మానసిక ప్రపంచ అధ్యయనం తెలిపింది.

సహోద్యోగితో లైంగిక సంబంధం:
కాదు.. మీరు ఈ వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యారని దీని అర్థం కాదు. ఇది మీ మెదడులో ఏర్పడిన ఓ రకమైన చర్యగా చెబుతున్నారు. ఈ వ్యక్తికి మీరే కావాలనుకునే ఆఫీసుల్లో తనకు ఇష్టమైన వ్యక్తికి తనలాంటి లక్షణాలే ఉన్నాయని చెబుతుంది.



టాయిలెట్ / లిఫ్ట్‌లో చిక్కుకోవడం :
ఉద్యోగంలో చిక్కుకుపోయిందనే భావన వల్ల ఇలాంటి కలలు వస్తాయి. ముందుకు సాగలేరు.. ఎదిగే అవకాశం ఉండదు.. అందుకే టాయిలెట్, లిప్ట్ లో చిక్కుకున్నామనే కలల రూపంలో వస్తుంటాయి. కొనసాగితే మీ కెరీర్ వారీగా ఏదో మార్చవలసి ఉంటుంది. మీ కెరీర్ ఎలా ఎదుగుతుందో దాని గురించి మీ యజమానితో మాట్లాడటానికి ప్రయత్నించండి.

READ  వాలంటైన్స్ డే గిఫ్ట్ : మీ X ఫ్రెండ్ పై రీవేంజ్ తీర్చుకునే ఛాన్స్

ఆఫీసుల కలల గురించి ఆందోళనగా ఉంటే? :
మీరు ఆఫీసుల్లో కలలు ఎక్కువగా కంటున్నారా? మీరు ఏమి చేయాలో సివి నిపుణులు చెబుతున్నారు.. మరుసటి రోజు ఉదయం మీరు తొందరా మేల్కొనేలా ప్లాన్ చేసుకోండి. మీరు పని సంబంధిత ఆందోళనతో బాధపడుతుంటే మాత్రం పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడటానికి ఈ కింది కొన్ని విషయాలు తప్పక గుర్తించుకోవాలి..



మీ యజమానితో మాట్లాడండి :
ఆఫీసుల్లో మీరు ఆందోళనగా ఉన్నారంటే.. మీ యజమాని నుంచి ప్రోత్సాహం తప్పక అందాలి. మీ కెరీర్‌ అవసరమైన వృద్ధి సాధించేలా అవకాశం ఇవ్వాలని మీ యజమానిని అడగండి. ఉన్నతాధికారులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ధైర్యంగా చెబితే.. వారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తారు. మీ యజమానితో మాట్లాడటానికి మీకు ఇబ్బందిగా ఉంటే… మీతో కలిసి పనిచేసే వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాలి.

మీ భవిష్యత్తుపై నియంత్రణ అవసరం :
మీ భవిష్యత్తుపై నియంత్రణపై గురించి ఆలోచించండి.. మీ ప్రస్తుత రోల్ ఏంటో పరీక్షించుకోండి. మీరు అసంతృప్తిగా ఉంటే ఇతర మార్గాలను అన్వేషించడంలో తప్పు లేదు. వినోద కార్యకలాపాలను ప్రయత్నించండి. పని నుండి ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి. మీ స్నేహితులతో కలిసి సరదాగా ఏదైనా చేయటానికి ప్రయత్నించండి. రాత్రి భోజనానికి వెళ్లండి. మీ మనస్సును పని నుండి దూరం చేస్తుంది. మీకు ఒత్తిడి ఏమిటో మీ స్నేహితులకు తెలియజేయండి.

Related Posts