WhatsApp is banning groups with suspicious names: Report

BAN చేస్తారు జాగ్రత్త : మీ WhatsApp Group పేరు ఇలా మార్చారా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. మీ వాట్సాప్ గ్రూపులకు పేర్లు ఎలా పెడుతున్నారు. ఎలా పెడితే అలా గ్రూపు పేర్లు పెట్టకండి. మీ ప్రతి మూవెంట్.. వాట్సాప్ సంస్థ సీక్రెట్ గా గమనిస్తోంది. ప్రత్యేకించి వాట్సాప్ గ్రూపులపై ఓ కన్నేసి ఉంచింది. ఎలాంటి అనుమానాస్పద యాక్టివిటీ కనిపించినా వెంటనే బ్యాన్ చేసేస్తోంది వాట్సాప్.

ప్రతి వాట్సాప్ యూజర్ తమ అకౌంట్ నుంచి గ్రూపులను క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని గ్రూపుల్లోనైనా జాయిన్ కావొచ్చు. సదరు గ్రూపు అడ్మిన్ అనుమతితో జాయిన్ కావొచ్చు. చాలామంది వాట్సాప్ యూజర్లు ఎన్ని గ్రూపులు క్రియేట్ చేసుకున్నా పర్వాలేదు. కానీ, గ్రూపు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. గ్రూపు ప్రాధాన్యం తెలియకుండా ఇష్టమెచ్చినట్టు గ్రూపులకు పేర్లు పెడితే లేనిపోని చిక్కుల్లో పడతారు జాగ్రత్త. 

కొంతమంది వాట్సాప్ యూజర్లు తమ చాట్ బాక్సుల్లో ఏది పడితే అది షేర్ చేయడం చేయరాదని హెచ్చరిస్తోంది. ఈ విషయంలో ఏడాది క్రితమే కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించినవారి అకౌంట్లపై శాశ్వతంగా నిషేధం విధిస్తోంది. వాట్సాప్ గ్రూపుకు పేరు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం
ఉంది. మనోభావాలను దెబ్బతినేలా.. రెచ్చగొట్టే అంశాలకు సంబంధించిన నిషేధిత పేర్లను వాట్సాప్ గ్రూపులకు పెడితే వెంటనే ఆ గ్రూపు బ్యాన్ అవుతుంది.

మలాసియస్ గ్రూపు టైటిల్స్ పెట్టినవారి అకౌంట్లను ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే వాట్సాప్ బ్యాన్ చేస్తుందని హెచ్చరిస్తోంది. అసభ్యకరమైన పేర్లను గ్రూపులకు పెట్టిన అకౌంట్లను శాశ్వతంగా బ్యాన్ చేసినేట్టు ఒక రెడిట్ యూజర్ తెలిపాడు. ఒక వ్యక్తి తన వాట్సాప్ అకౌంట్లో యూనివర్శిటీకి చెందిన గ్రూపుకు పేరు పెట్టాడు. యూనివర్శిటీ పేరు మార్చేసి వల్గర్ నేమ్ పెట్టాడు. మరుసటి రోజున ఆ గ్రూపు మొత్తం అతడితో కలిపి వాట్సాప్ బ్యాన్ చేసేసింది. 

క్షణాల్లో గ్రూపు బ్యాన్ : 
ఈ విషయంపై వాట్సాప్ కాంటాక్ట్ సపోర్ట్ లో సంప్రదించగా.. కంపెనీ రూల్స్ ఉల్లంఘించడంతోనే గ్రూపు బ్యాన్ చేసినట్టు అందరి అకౌంట్లకు ఒకే మెసేజ్ వచ్చింది. మరో రెడిట్ యూజర్ కూడా తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపాడు. వాట్సాప్ గ్రూపులోని ఒక సభ్యుడు.. గ్రూపు పేరును అసభ్యకరమైన రీతిలో పెట్టాడు. వెంటనే 50 మందితో కూడిన ఆ గ్రూపు బ్యాన్ అయింది. పేరు మార్చిన ఒక నిమిషంలోనే మొత్తం గ్రూపు బ్యాన్ అయిపోయింది. 100 మందితో కూడిన ఒక స్కూల్ వాట్సాప్ గ్రూపు కూడా ఇలానే బ్యాన్ అయింది. 

మరో విషయం ఏమిటంటే.. వాట్సాప్ అకౌంట్లలోని గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న ఎవరైనా గ్రూపు పేరు, ప్రొఫైల్ పిక్ మార్చేసే వెసులుబాటు ఉంది. కానీ, దీనిపై గ్రూపు అడ్మిన్లకు మాత్రమే అనుమతించేలా అప్ డేట్ తీసుకొచ్చింది కూడా. అడ్మిన్ మాత్రమే గ్రూపు పేర్లను, గ్రూపు ప్రొఫైల్ పిక్ మార్చే అధికారం ఉంటుంది.

READ  అమెరికాను వణికిస్తున్న ‘జొంబీ డీర్ ’వ్యాధి

ఒకవేళ గ్రూపు అడ్మిన్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయకపోయినా.. ఎవరైనా గ్రూపులోని వ్యక్తి.. గ్రూపు పేరును ఏదైనా నిషేధిత పేరును మార్చినట్టయితే ఆ గ్రూపు వెంటనే బ్యాన్ అవుతుంది. యూజర్లకు తమ కొత్త ఫోన్ నెంబర్ మారిస్తే తప్ప మరో దారి లేదు. వాట్సాప్ గ్రూపు నిషేధిత కాలం 27 రోజుల తర్వాత ఎత్తివేయడం జరుగుతుంది. మళ్లీ అతిక్రమిస్తే ఈసారి పూర్తిగా వాట్సాప్ గ్రూపు శాశ్వతంగా బ్యాన్ అవుతుంది. మరో గ్రూపు క్రియేట్ చేసుకునే అనుమతి కూడా కోల్పోవాల్సి వస్తుందని మరిచిపోకండి. 

Group ప్రైవసీ ఫీచర్ ఇదిగో :
వాట్సాప్ గ్రూపులకు సంబంధించి Group Invite ఫీచర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త గ్రూపు పాలసీలో మొత్తం మూడు ఆప్షన్లు ఉన్నాయి. EveryOne, My contacts లేదా My contacts Expect అని ఉంటాయి. వీటిలో Everyone ఎంపిక చేస్తే.. అందరూ తమ గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేసుకోవచ్చు. మరొకటి.. మీ కాంటాక్టుల్లో ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.

మీ కాంటాక్టు జాబితాలో లేనివారికి మిమ్మల్ని గ్రూపులో యాడ్ చేసే అనుమతి ఉండదు. మీరు పర్మీషన్ ఇస్తే తప్ప వారు మీ అకౌంటును గ్రూపులో యాడ్ చేయగలరు. ఇందుకోసం ఒక గ్రూపు ఇన్విటేషన్ లింక్ పంపొచ్చు. ఈ లింక్ 72 గంటల పాటు మాత్రమే యాక్టివేట్ అయి ఉంటుంది. ఆ తర్వాత Expire అయిపోతుంది. ఇలోగా ఈ లింక్ Accept చేస్తే గ్రూపులో జాయిన్ అవుతారు. లేదంటే మరోసారి ఇన్విటేషన్ పంపాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూపుల విషయంలో అడ్మిన్లదే కీలక పాత్ర అని గుర్తించాలి. గ్రూపు అడ్మిన్లు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..

ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే : 
* వాట్సాప్ గ్రూపు అడ్మిన్లదే బాధ్యత.
* మీ గ్రూపులో పోస్టులను నిరంతరం మానిటర్ చేయండి.
* అందరికి పోస్టులు చేసే పర్మిషన్ ఇవ్వకండి.
* అనుమానం వస్తే.. ఆయా వ్యక్తులను రిమూవ్ చేయండి.
* గ్రూపు టైటిల్ మార్చే అధికారం ఎవరికి ఇవ్వకండి.
* గ్రూపు టైటిల్ పేరు మార్పు విషయంలో జాగ్రత్త పడండి.
* నిషేధిత, రెచ్చగొట్టే అంశాలతో పేర్లు పెట్టకండి.
* వాట్సాప్ గ్రూపులపై మెసేంజర్ సంస్థ నిఘా పెట్టింది.
* తమాషా కోసం గ్రూపు పేరు మరోలా మార్చినా బ్యాన్ చేస్తారు.
* ఎలాంటి నోటిఫికేషన్ రాదు.. గ్రూపు బ్యాన్ అయిపోతుంది.
* నిమిషాల వ్యవధిలో గ్రూపు బ్యాన్ అవుతుంది. 
* 27 రోజుల పాటు నిషేధిత కాలం ఉంటుంది. 
* ఆ తర్వాత మళ్లీ మీ గ్రూపు పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది.
* మళ్లీ రూల్స్ ఉల్లంఘిస్తే.. శాశ్వతంగా గ్రూపు బ్యాన్ అవుతుంది.

READ  ఇండియన్ యూజర్లే హ్యాకర్ల టార్గెట్ : మీ వాట్సాప్‌లో డేంజరస్ స్పైవేర్

Related Posts