లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

డేటా షేరింగ్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న వాట్సప్..

Published

on

WhatsApp: వాట్సప్ శుక్రవారం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు ఫేస్‌బుక్‌తో తమ డేటాను పంచుకోవడానికి ప్రైవసీకి భంగం కలుగుతుందంటూ టెలిగ్రామ్, సిగ్నల్‌కు మరలుతున్నారు. స్మార్ట్‌ఫోన్ యాప్ ప్రపంచంలోనే అత్యధిక యూజర్లతో నడుస్తోంది. టెర్మ్స్ అండ్ కండిషన్స్ ను యాక్సెప్ట్ చేసి ఫేస్‌బుక్‌తో డేటా పంచుకోవడానికి రెడీగా ఉండాలి. ఈ నిర్ణయాన్ని వాట్సప్ వాయిదా వేసుకుంది.

‘రీసెంట్ అప్‌డేట్ గురించి చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. ఈ అప్‌డేట్ ఫేస్ బుక్ తో డేటాను షేర్ చేసుకునే సామర్థ్యం పెరగడం లేదు. ప్రజల నిర్ణయం ప్రకారమే పాలసీని సెట్ చేస్తాం. మే15నుంచి కొత్త బిజినెస్ ఆప్షన్లు రానున్నాయి’ అని వాట్సప్ వెల్లడించింది.

మన ప్రైవేట్ మెసేజెస్, కాల్స్ ను మనం వినలేం. అది ఫేస్ బుక్ కు కూడా సాధ్యపడదు. మనం చేసిన కాల్స్.. ఎక్కడి నుంచి వాడుతున్నామనే లొకేషన్ కూడా ఫేస్ బుక్ ట్రాక్ చేయలేదు. వాట్సప్ చాట్స్ ను మేనేజ్ చేయడం కోసం ఫేస్ బుక్ నుంచి సెక్యూర్ హోస్టింగ్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకున్నాం. ఈ మేరకు ఎటువంటి సలహాలు, సందేహాలు ఉంటే నేరుగా పంపించొచ్చు అని వాట్సప్ పోస్టు చేసింది.