This WhatsApp feature could be draining your mobile phone's battery

వాట్సాప్‌‌ కొత్త ఫీచర్‌తో జాగ్రత్త : మీ మొబైల్ ఫోన్ బ్యాటరీని తినేస్తోంది!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. ఇటీవల వాట్సాప్‌లో వచ్చిన కొత్త ఫీచర్.. యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఫీచర్ బాగుందిలే అని అప్ డేట్ చేసుకుంటే.. మొబైల్ ఫోన్ బ్యాటరీని తినేస్తోంది. పెట్టిన ఛార్జింగ్ పెట్టినట్టే పోతోంది. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టిన కొన్ని నిమిషాలు కూడా ఉండటం లేదు. ఈ ఫీచర్ అప్ డేట్ చేయడానికి ముందు గంటల పాటు పనిచేసిన మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ ఇట్టే అయిపోతోంది. వాట్సాప్ అకౌంట్ లాక్ సెట్ చేసుకునేలా ఫింగర్ ఫ్రింట్ లాక్ ఫీచర్ వచ్చిన సంగతి తెలిసిందే.

యూజర్ల ప్రైవసీ కోసం తీసుకొచ్చిన లాకింగ్ ఫీచర్ కారణంగా కొత్తగా బ్యాటరీ సమస్యలు వస్తున్నాయి. ఈ ఫీచర్ అప్ డేట్ చేసుకున్న చాలామంది యూజర్ల మొబైల్ బ్యాటరీలో భారీ సమస్య తలెత్తింది. వాట్సాప్ యూజర్లు వాడే మొబైల్ కంపెనీ డివైజ్ ల్లో వన్ ప్లస్, శాంసంగ్ మొబైల్లోనే ఎక్కువగా బ్యాటరీ సమస్యల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కొత్త వన్ ప్లస్ 7T ప్రో మొబైళ్ల బ్యాటరీల్లో ఈ సమస్య అత్యధికంగా ఉన్నట్టు యూజర్లు కంప్లయింట్ చేస్తున్నారు. ఫుల్ ఛార్జింగ్ పెట్టినా ఐడిల్ బ్యాటరీ 33-40 శాతానికి పడిపోతుందని వాపోతున్నారు.

వన్ ప్లస్ ఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ 9, ఆండ్రాయిడ్ 10 వెర్షన్లలో బ్యాటరీ సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. గూగుల్ ఫిక్సల్, షియోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. శాంసంగ్ ఫ్లాగ్ షిప్స్ శాంసంగ్ గెలాక్సీ s10 సిరీస్, గెలాక్సీ నోట్ 10 సిరీస్ ల్లో కూడా వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్ కారణంగా బ్యాటరీ డ్రేయిన్ ప్రాబ్లమ్ మొదలైంది.

ప్రత్యేకించి.. వాట్సాప్ వెర్షన్ 2.19.308 వెర్షన్ వాడే యూజర్లకు మాత్రమే బ్యాటరీ సమస్యలు అధికంగా ఉన్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ వెర్షన్ అప్ డేట్ లో ఒక బగ్ ఉందని, దీని కారణంగానే బ్యాటరీ డ్రెయిన్ అవుతుందని అంటున్నారు. ఈ సమస్య తీవ్రంగా ఉన్న వాట్సాప్ యూజర్లు వెంటనే తమ వాట్సాప్ యాప్ ను Uninstall చేసిన తర్వాత మళ్లీ రీఇన్ స్టాల్ చేసి చూడండి.

ఇలా చేస్తే మీ ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు. అయినప్పటికీ బ్యాటరీ సమస్య అలాగే ఉన్నట్టుంటే.. వాట్సాప్ బీటా వెర్షన్ ట్రై చేసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ సేవర్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది వాట్సాప్ నోటిఫికేషన్లను నియంత్రిస్తుంది. మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ లైఫ్ టైమ్ కూడా మెరుగుపడుతుంది. మరోవైపు ఆండ్రాయిడ్ యాప్ బీటా వెర్షన్ యూజర్ల కోసం డార్క్ థీమ్ రిలీజ్ చేస్తోంది. వాట్సాప్ 2.19.327 వెర్షన్ మాదిరిగానే నైట్ బ్లూతో అందుబాటులో ఉండనుంది. దీనిపై వాట్సాప్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

READ  హైదరాబాదీలు రెడీ అవ్వండి.. మేఘాలలో భోజనం చేద్దాం

Related Posts