లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Whatsup లో కొత్త ఫీచర్స్ ఇవే

Published

on

whatsapp five new features

సోషల్ మీడియా కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. ఇందులో Whatsup కూడా ఒకటి. ఇప్పటికే కొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సరికొత్త ఫీచర్స్ Whatsup లో వస్తాయని, అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని కంపెనీ వెల్లడించింది.

యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్, వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ వీడియో కాల్స్​, కైఓఎస్​కు మాయమైపోయే స్టేటస్​ లాంటి ఫీచర్స్​ను కొద్దివారాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది.

Dark Mode : ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లలో చాలా కాలం క్రితమే వాట్సాప్​ డార్క్ మోడ్​ను తీసుకొచ్చింది. వెబ్​ వెర్షన్​కు ఈ ఫీచర్​ను జోడించనుంది.

Video Call Improvements : కాల్ క్వాలిటీపై దృష్టి సారించింది. కాల్​లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిపై నొక్కితే ఫోకస్ అయ్యేలా మార్పులు చేర్పులు చేస్తోంది. గ్రూప్ వీడియో కాల్​లో పాల్గొనే వారి సంఖ్యను ఎనిమిదికి పెంచిన సంగతి తెలిసిందే.

Status ​: స్టేటస్ లో తనంతట అదే మాయమైపోయే ఫీచర్ అందుబాటులోకి రానుంది. KOS ​కు వాట్సాప్​ విస్తరించనుంది.

QR Codes : ఒక్క క్యూఆర్​ కోడ్​తో వారి నంబర్​ను స్కాన్ చేసి, ఆ వ్యక్తిని యాడ్ చేసుకోవచ్చు.

Animated Stickers : చాటింగ్ సమయంలో ఫన్​గా మార్చే యానిమేటెడ్​ స్టిక్కర్స్​ను వాట్సాప్​ తీసుకురానుంది. వీటిలో వారికి నచ్చిన స్టిక్కర్స్​ను యూజర్లు డౌన్​లోడ్​ చేసుకుని వాడుకోవచ్చు.

Read: TikTok పనిచేయడం లేదు.. ఈ భారతీయ యాప్స్ ఓసారి ట్రై చేయండి!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *