వాట్సాప్‌లో లేటెస్ట్ ఫీచర్లు.. ఏయే ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను అప్ డేట్ చేస్తోంది. చాలా ఫీచర్లు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి.. మరికొన్ని ఫీచర్లు బీటా టెస్టింగ్ దశలో ఉన్నాయి.. యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ లేటెస్ట్ ఫీచర్లను వాట్సాప్ అప్ డేట్ చేస్తోంది. వాట్సాప్ ఏయే ఫీచర్లు రిలీజ్ చేస్తుందో ఓసారి లుక్కేయండి..

ఒకే అకౌంట్.. ఒకేసారి మల్టీ డివైజ్‌ల్లో :
వాట్సాప్.. మల్టీ డివైజ్ ఫీచర్ తీసుకొస్తుందని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఒక వాట్సాప్ అకౌంట్ ఒకే డివైజ్ లో మాత్రమే యాక్సస్ చేసుకునే వీలుంది.. ఇకపై అలా కాదు.. ఒకే అకౌంట్ ను డిఫరెంట్ డివైజ్ ల్లో ఒకే సమయంలో లాగిన్ కావొచ్చు.. మొబైల్, డెస్క్ టాప్ అన్నింట్లో యాక్సస్ చేసుకోవచ్చు.

వాట్సాప్ వెబ్ ద్వారా డెస్క్ టాప్ లో లాగిన్ అయ్యే అవకాశం ఉండేది.. కానీ, మొబైల్లో మాత్రం ఒక లాగిన్ మాత్రమే అనుమతి ఉండేది.. వాట్సాప్ తీసుకొస్తున్న ఈ ఫీచర్ ద్వారా ఒకే అకౌంట్ ఒకే సమయంలో వేర్వేరు డివైజ్ ల్లో లాగిన్ కావొచ్చు.. మార్క్ చేసిన స్టార్ మెసేజ్ Archives చాట్స్ కూడా కొత్తగా లాగిన్ డివైజ్ లో Sync అవుతాయి.ఒకేసారి 50 మందితో.. :
గూగుల్ మీట్, జూమ్ యాప్ తరహాలో వాట్సాప్ కూడా వీడియో కాల్ ఫీచర్ ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి 50 మందితో ఆన్ లైన్ లో మాట్లాడుకోవచ్చు.. ఈ ఫీచర్ సాయంతో గ్రూపు క్రియేట్ చేయొచ్చు.. స్నేహితులు, కుటుంబ సభ్యులు సహా ఇతరులను వాట్సాప్ వెబ్ లేదా డెస్క్ టాప్ నుంచి ఇన్వైట్ చేసుకునే సౌకర్యం ఉంది.

ఎమోజీలు, యానిమేటేడ్ స్టిక్కర్లు :
వాట్సాప్ ఎమోజీల కోసం కొత్తగా 138 ఎమోజీలను వాట్సాప్ తీసుకొస్తోంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యాప్ ఉపయోగించే వారికి మాత్రమే ఈ ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చెఫ్, ఫార్మర్, పెయింటర్ సహా ఇతర వృత్తులకు చెందిన ఎమోజీలనూ అందిస్తున్నారు. కొత్తగా నాలుగు యానిమేటేడ్ స్టిక్కర్ ప్యాక్ కూడా వాట్సాప్ యూజర్లు డౌన్ లోడ్ చేయొచ్చు..

అడ్వాన్స్ సెర్చింగ్ :
వాట్సాప్ చాట్ బాక్సులో ఎవరితోనో ఏదో ముఖ్యమైన అంశంపై మాట్లాడారని అనుకుందాం.. కొన్ని రోజులు గడిచిపోయాయి.. ఇప్పుడు ఆ చాట్ కోసం వెతకడం మొదలుపెట్టారు.. అలా సెర్చ్ చేయాలంటే ఒక్కో పేజీ స్ర్కోల్ చేసుకుంటూ వెళ్లాలి… ఇలా చేయడం కష్టంతో కూడుకున్న పని.. సులువుగా పాత చాట్ వెతకడం ఎలా అని సెర్చ్ చేస్తున్నారా?అయితే మీ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.. అదే.. అడ్వాన్స్ సెర్చింగ్ ఫీచర్..ఎప్పుడో వాట్సాప్‌లో టైప్ చేసిన మెసేజ్, ఫొటో, వీడియో లేదా డాక్యుమెంట్ కావాలి. అందుకే వాట్సాప్ అడ్వాన్స్ సెర్చ్ ఫీచర్ తీసుకొస్తోంది. యూజర్లు గతంలో పంపిన మెసేజ్, ఫొటో, వీడియో, డాక్యుమెంట్లను సులభంగా సెర్చ్ చేయొచ్చు.

READ  ప్రధానికి బర్త్‌డే విషెస్ చెప్పండిలా : Modi వాట్సాప్ స్టిక్కర్లు డౌన్‌లోడ్

పర్మినెంట్ మ్యూట్ ఆప్షన్ :
వాట్సాప్ లో చాట్ గ్రూపులు అంటే ఏంటో అందరికి తెలుసు.. ఒక వాట్సాప్ అకౌంట్లో ఎన్ని గ్రూపుల్లోనైనా యాడ్ కావొచ్చు.. వీటిలో కొన్ని వాట్సాప్ గ్రూపులు మాత్రమే ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాయి.. కొన్ని అలానే ఉండిపోతాయి.అలాంటి వాట్సాప్ గ్రూపులను మ్యూట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు.. ఇప్పుడు కొత్త ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది.. పర్మినెంట్ మ్యూట్ ఫీచర్.. దీనిద్వారా ఏదైనా వాట్సాప్ గ్రూపును పర్మినెంట్ గా మ్యూట్ చేసుకోవచ్చు.. మ్యూట్ ఫీచర్‌లో ఇప్పటి దాకా 8 గంటలు, ఒక వారం, ఏడాది పాటు మ్యూట్ చేసుకునే అవకాశం ఉంది. ఇకపై పర్మినెంట్ మ్యూట్ చేసే ఆప్షన్ తీసుకోస్తోంది.

QR codeతో సులువుగా :
వాట్సాప్ అకౌంట్లో ఎవరైనా ఫోన్ నెంబర్ యాడ్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉంది.. కాంటాక్ట్ యాడ్ చేసిన ప్రతిసారి వారి వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. ఇకపై అలా కాదు.. వాట్సాప్ QR Code పేరుతో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.ఈ ఫీచర్ ద్వారా ఏ వ్యక్తి వాట్సాప్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా వారి వాట్సాప్ సెట్టింగ్ లోకి అక్కడి క్యూర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.. వాట్సాప్ అకౌంట్ పేరు, వారి ఫోన్ నెంబర్ మీ అకౌంట్లో ఆటోమాటిక్ గా సేవ్ అయిపోతుంది..

డార్క్ మోడ్ :
ఇప్పటి వరకు డార్క్ మోడ్ ఫీచర్ మొబైల్ వెర్షన్‌లో మాత్రమే ఉంది. ఇకపై డెస్క్ టాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తోంది.. వాట్సాప్ వెబ్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.. అక్కడ థీమ్స్ సెక్షన్ పై క్లిక్ చేయాలి.. అందులో డార్క్ మోడ్ ఫీచర్ కనిపిస్తుంది.. క్లిక్ చేసి ఓకే బటన్ నొక్కితే చాలు.. ఆటోమాటిక్ గా డార్క్ మోడ్ ఆప్షన్ ఎనేబుల్ అయిపోతుంది..గ్రూప్ కాలింగ్ :
వాట్సాప్ గ్రూప్ కాలింగ్.. అందరికి ఒకేసారి గ్రూపు కాల్ చేయాలంటే ఇప్పటి వరకు 8 మంది వరకు చేసుకోవచ్చు.. ఈ గ్రూప్ కాలింగ్ సమయంలో ఎవరు మాట్లాడిన సరే.. ఫోన్ వాట్సాప్ స్ర్కీన్ పై అందరి ముఖాలు ఒకే సైజులో కనిపిస్తాయి. దాంతో కాస్తా కన్ఫ్యూజన్ ఉంటుంది.. ఇకపై మాట్లాడే వ్యక్తిని హైలెట్ చేసే విధంగా కొత్త ఫీచర్ రాబోతోంది.. గ్రూప్ వీడియో కాల్లో మాట్లాడే వ్యక్తి విండోపై ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే వారి విండో పెద్దదిగా కనిపిస్తుంది..

Related Posts