WhatsApp, PUBG and Zoom are not banned in India

భారత్‌లో పబ్జీ, జూమ్, వాట్సాప్ ‌బ్యాన్ చెయ్యకపోవడానికి కారణం ఇదే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చైనాకి చెందిన 59 అప్లికేషన్లపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో టిక్ టాక్(TikTok) సహా పలు యాప్ లు ఉన్నాయి. అయితే వీటితో పాటు వాట్సాప్(Whatsapp), జూమ్(Zoom), పబ్‌జీ(PubG) కూడా బ్యాన్ అయిపోయాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో ప్రజలు ఆందోళన చెందారు. తమ మొబైళ్లలో వాట్సాప్, పబ్‌జీ పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. వాస్తవానికి వాట్సాప్, పబ్జీ, జూమ్ యాప్స్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చెయ్యలేదు. దీనికి కారణాలు ఉన్నాయి. వాట్సాప్ విషయానికి వస్తే అది మన దేశంలో చట్టబద్ధంగానే పనిచేస్తోంది. దీంతో కేంద్రం దాన్ని టచ్ చెయ్యలేదు.

Zoom చైనా యాప్ కాదు:
చాలామంది వీడియో కాన్ఫరెన్స్ యాప్ జూమ్‌ని(Zoom) చైనా యాప్ అనుకుంటున్నారు. అది నిజం కాదు. జూమ్‌ని సృష్టించింది ఎరిక్ యువాన్(Eric Yuan) స్థాపించిన కంపెనీ. ఈయన చైనా-అమెరికన్. కానీ… అమెరికా పౌరసత్వం ఉంది. జూమ్, జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ కలిగిన కంపెనీ అమెరికాలో ఉంది. అలాగని జూమ్‌తో సమస్యలు లేవని కాదు. యూజర్ల వివరాలు చైనాకు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలున్నప్పటికీ… ప్రస్తుతం జూమ్ ఇండియాలో బ్యాన్ కాలేదు.

పబ్జీ.. దక్షిణ కొరియాది:
పబ్జీ(PUBG) గేమ్ యాప్‌ని బ్యాన్ చెయ్యాలని భారత్ లో చాలామంది కోరుతున్నారు. గంటల తరబడి పిల్లలు గేమ్ ఆడుతుంటే… వాళ్ల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ పబ్‌జీ వల్ల పెద్దగా సమస్యలు లేవని కేంద్రం భావిస్తోంది. ఈ గేమ్‌ని దక్షిణ కొరియాకి చెందిన గేమ్ స్టూడియో బ్లూహోల్(Blue Hole) తయారు చేసింది. ఈ గేమ్ పాపులర్ అయ్యాక… చైనా కంపెనీ టెన్సెంట్(Tencent)… దీన్ని చైనాలో అనుమతించేందుకు డీల్ కుదుర్చుకుంది. క్రమంగా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని పెంచుకుంటూ పోతోంది. ఉదాహరణకు ఇండియాలో ఈ గేమ్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది టెన్సెంట్ అని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. పబ్‌జీ యాజమాన్య హక్కులు ఇప్పుడు ఒక్కరి చేతుల్లో లేవు. అందువల్ల ఈ గేమ్‌ యాప్‌ని సోమవారం(జూన్ 29,2020) నిషేధించకపోయి ఉండొచ్చని తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం పబ్‌జీకి ఇండియాలో ఎలాంటి సమస్యా లేదు.

వాట్సాప్..ఫేస్ బుక్ ది:
వాట్సాప్(WhatsApp) బ్యాన్ చెయ్యాలని ఇండియాలో పెద్దగా ఎవరూ కోరట్లేదు. పైగా వాట్సాప్ చైనాకి చెందిన యాప్ కాదు. వాట్సాప్ ఫేస్‌బుక్ నిర్వహిస్తున్న యాప్. అయితే… ఫేస్‌బుక్‌పై చాలా ప్రైవసీ విమర్శలు ఉన్నాయి. వాటికి చైనాతో సంబంధం లేదు. అందువల్ల వాట్సాప్‌కి ఇండియాలో ఎలాంటి ఢోకా లేదు. అలాగని వాట్సాప్‌లో వచ్చే అన్ని మెసేజ్‌లూ నిజమైనవే అని నమ్మవద్దు. ఇందులోనూ ఎన్నో ఫేక్ రూమర్లు వస్తూనే ఉన్నాయి.

చైనాపై భారత్ ప్రతీకారం:
చైనాకి చెందిన 59 అప్లికేషన్లపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. వాట్సాప్, జూమ్, పబ్జీ యాప్ లపై బ్యాన్ విధించకపోవడానికి కారణాలు ఇవే. గల్వాన్ లోయాలో చైనా కుట్రపూరిత దాడిలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత యావత్ భారతం ప్రతీకారంతో రగిలిపోతోంది. చైనా ఉత్పత్తులు, యాప్ లను నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, దేశ భద్రత, ప్రజల వ్యక్తిగత సమాచారానికి ముప్పు కలిగించే 59 చైనా అప్లికేషన్స్ పై నిషేధం విధించినట్టు భారత ప్రభుత్వం తెలిపింది.

భారత్ బ్యాన్ చేసిన 59 చైనా యాప్స్ ఇవే..

Read:భారత్ కంటే ముందే టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన దేశాలు ఇవే!

Related Posts