లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

WhatsApp లో కొత్త Emojis

Published

on

whatsapp-emojis

సోషల్ మీడియాలో సమాచారం ఇతరులకు చేరవేయడంలో WhatsApp కీలక పాత్ర పోషిస్తోంది. దీనిని ఉపయోగించే వారికి కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా..138 ఎమోజీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.సాధారణ స్టిక్కర్లతో పాటు యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ లను అందుబాటులోకి తెచ్చింది. కానీ..ఫస్ట్ టైం చూసినప్పుడు అంతగా తేడా కనిపించదు. కొత్త రంగు టోన్లు, బట్టలు, స్కిన్ టోన్లలో మార్పులున్నాయి. WhatsApp బీటా ట్రాకర్ డబ్ల్యూఏ బేటా ఇన్ఫో ఆండ్రాయిడ్ WhatsApp వెర్షన్ 2.20.197.6 బీటాలో సరికొత్త ఎమోజీలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌ల జాబితాలో రికోస్ స్వీట్ లైఫ్, ప్లేఫుల్ పియోమారు, బ్రైట్ డేస్, మూడీ ఫుడీస్, చమ్మీ చుమ్ చుమ్స్ ఉన్నాయి.ఏమోజీలు..సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. మనస్సు ఎలా ఉందో చెప్పాలంటే..ఒక్క అక్షరం రాయకుండా..జస్ట్ ఒక్క ఎమోజీ క్లిక్ చేస్తే చాలు. నవ్వు, దుఃఖం, బాధ, కోపం, ఎక్స్ ప్రషన్ కావాలన్నా ఓ ఏమోజీ నే చూపిస్తుంది. అక్షరాలకు బదులుగా ఎస్సెమ్మెస్ చేయగలిగే ఈ ఎమోజీ లు నిత్య జీవితంలో మనం వాడుకునే అన్ని వస్తువుల పైకి ఎక్కి కనువిందు చేస్తున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *