లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

Try చేశారా? : WhatsApp Webలో 4 Tricks ఇదిగో!

Published

on

WhatsApp Web’s four features that you can try right away

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ 2015లో వెబ్-ఫ్రెండ్లీ వెర్షన్ యాప్ ప్రవేశపెట్టింది. మొబైల్ వెర్షన్ మాదిరిగానే డెస్క్ టాప్ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్ వెర్షన్ ద్వారా యూజర్లు ఈజీగా తమ మొబైల్ వాట్సాప్ నుంచి డెస్క్ టాప్ యాక్సస్ చేసుకోనే వీలుంది. మొబైల్ వెర్షన్ ఫీచర్లన్నీ దాదాపు వెబ్ వెర్షన్ కూడా ఆఫర్ చేసింది.

కానీ, WhatsApp Web యూజర్లు మొబైల్ యాప్ మాదిరిగా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయడం కుదరదు. ఇప్పటివరకూ వాట్సాప్ రిలీజ్ చేసిన ఎన్నో ఫీచర్లు మొబైల్ వెర్షన్ తో పాటు వాట్సాప్ వెబ్ లోనూ అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువగా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఏమి ఉన్నాయి. వాటితో ప్రయోజనాలేంటి? వాటి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. రెండు అకౌంట్లు ఒకేసారి వాడొచ్చు :
గూగుల్ Chrome బ్రౌజర్ ద్వారా WhatsApp యాక్సస్ చేసుకుంటున్నారా? అయితే మీరు రెండు అకౌంట్లను ఒకేసారి ఆపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాట్సాప్ అకౌంట్‌ను Chrome రెగ్యులర్ మోడ్ లో యాక్సస్ చేసుకోండి. రెండో వాట్సాప్ అకౌంట్ Incognito Modeలో యాక్సస్ చేసుకోండి. వాస్తవానికి వాట్సాప్ తమ యూజర్లకు సింగిల్ బ్రౌజర్‌పై ఒక అకౌంట్ మాత్రమే యాక్సస్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, మల్టీపుల్ వాట్సాప్ అకౌంట్లను ఒకేసారి సింగిల్ బ్రౌజర్ పై ఈజీగా యాక్సస్ చేసుకునే వీలుంది.

2. WA Toolkit Extension :

మీరు వాడే Browserకు ఈ WA Toolkit Extension యాడ్ చేయడం ద్వారా రెండు విధాలుగా వినియోగించుకోవచ్చు. అందులో ఒకటి Background Notification, రెండోది Full width chat bubble. ఈ రెండింటితో ఈజీగా వాట్సాప్ మెసేజ్ లను ఆపరేట్ చేసుకోవచ్చు.

i) Background Notification:

ఈ బ్యాక్ గ్రౌండ్ నోటిఫికేషన్ ద్వారా వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. యాప్ చాట్ బాక్సులో వచ్చిన మెసేజ్‌ను ఈజీగా రీడ్ చేయొచ్చు. మీరు చదవని ఏదైనా వాట్సాప్ మెసేజ్ ను Extension ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా ఆయా మెసేజ్ లను చూడవచ్చు. దీనికి అదనంగా ఏ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ మెసేజ్ రీడ్ చేయలేదో కూడా చెక్ చేసుకోవచ్చు.

ii) Full width chat bubble:

మీ వాట్సాప్.. చాట్ బబుల్ విండో డిఫాల్ట్‌గానే ఫిట్ గా ఉంటుంది. టెక్స్ట్ పరిమాణం ఎక్కువగా ఉన్నప్పటికీ చాట్ విండో సాగీపోదు. అందుకే ఎక్కువ కంటెంట్ ఉన్నప్పటికీ అది మల్టీ లైన్లలోకి ఆటోమాటిక్‌గా అడ్జెట్ అవుతుంది. ఒకవేళ మెసేజ్ మధ్యలో లైన్ గ్యాప్ ఉన్నా కూడా ఫిక్సడ్ గానే కనిపిస్తుంది. ఈ టూల్ ద్వారా వాట్సాప్ చాట్ బబుల్‌ను సాగనీయకుండా ఫిక్స్ చేస్తుంది.

3. Emoji shortcut :
వాట్సాప్ వెబ్.. Text bar ఎడమవైప భాగంలో Emoji icon ఉంటుంది. దానిపై Click చేయగానే Appలోని Emojis లైబ్రరీ మొత్తం ఓపెన్ అవుతుంది. Emoji Tray ఓపెన్ చేయకుండా ఏదైనా Emoji యాక్సస్ చేసుకోవడానికి ఒక Shortcut కూడా ఉంది. ఒక ఎమోజీని యాక్సస్ చేయాలంటే ముందుగా దాని పేరులో తొలి రెండు పదాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు పదాలకు ముందు తప్పనిసరిగా (:) ఉంచాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఎమోజీని స్నేహితుడికి పంపితే Text barలో ‘:sa’ అని ఇలా టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఎమోజీ రియాక్షన్ డిస్ ప్లే అవుతుంది.

4. Picture-in-Picture (PiP) mode :
వాట్సాప్ యూజర్ల కోసం మెసేంజర్ కంపెనీ 2018లో ‘ఫిక్చర్-ఇన్-ఫిక్చర్’ అనే ఫీచర్ రిలీజ్ చేసింది. మొబైల్ వెర్షన్ యాప్ తో పాటు వెబ్ వెర్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. వివిధ ప్లాట్ ఫాంలైన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నుంచి వీడియోలను Watch చేసేందుకు అనుమతి ఇస్తుంది.

Appనుంచి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే అక్కడి నుంచే ఈజీగా Watch చేయెచ్చు. Chat Window టాప్ రైట్ కార్నర్ లో Videos ప్లే అవుతుంటాయి. ఒకవైపు వీడియో చూస్తేనే మరోవైపు కూడా Chat కూడా చూడవచ్చు. ఏదైనా చాట్ చేసుకోవచ్చు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *