లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

కొత్త మల్టీ డివైజ్ ఫీచర్ : ఒక వాట్సాప్ అకౌంట్‌ను 4 డివైజ్‌ల్లో ఒకేసారి కనెక్ట్ చేయొచ్చు!

Published

on

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నుంచి వాట్సాప్ మల్టీ డివైజ్ ల్లో వాడుకోవచ్చు.. ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఒకే సమయంలో 4 డివైజ్ ల్లో ఓపెన్ చేసుకోవచ్చు.. అంతేకాదు.. చాట్ సింకరైజ్ కూడా సపోర్ట్ చేస్తుంది.. ప్రస్తుతానికి ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ కొత్త మల్టీ డివైజ్ సపోర్టుపై వర్క్ చేస్తోంది. ప్రత్యేక ఐప్యాడ్ యాప్‌తో సహా మల్టీ డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ వాడే సామర్థ్యాన్ని వాట్సాప్ పరీక్షిస్తోందని WABetaInfo వెల్లడించింది.వాట్సాప్ ప్రస్తుతం వాట్సాప్ వెబ్ ద్వారా మల్టీపుల్ డివైజ్ ల్లో ఓపెన్ చేసేందుకు సపోర్ట్ ఇస్తుంది.. వాట్సాప్ వెబ్ కనెక్ట్ చేయాలంటే ఫోన్ అకౌంట్‌కు తిరిగి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.. వాట్సాప్ వెబ్‌కు ఫోన్‌ను ఆన్ చేసి వెబ్‌కు కనెక్ట్ చేయాలి.. అయితే ఈ కొత్త మల్టీ డివైజ్ సపోర్ట్ ద్వారా ప్రతిసారి ఫోన్‌కు తిరిగి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.. ఒకేసారి మల్టీ డివైజ్‌ల్లో పరికరాల్లో వాట్సాప్‌ను ఉపయోగించడానికి యూజర్లకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది.ఈ కొత్త మల్టీ డివైజ్ ఫీచర్‌పై చాట్ హిస్టరీ (Chat Sync) సింకరింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. వాట్సాప్ వినియోగదారులు తమ మెసేజ్‌లను డివైజ్‌ల్లో సింకరింగ్ చేయడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. మల్టీ డివైజ్ సపోర్ట్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది.. వాట్సాప్ ఐప్యాడ్ యాప్‌ను విడుదల చేస్తుందని WABetaInfo నివేదించింది.


ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 2 బిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. వైరల్ మెసేజింగ్ ఫార్వార్డింగ్‌ను పరిమితం చేయడానికి కొన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. మెసేజింగ్ సర్వీసులో వైరల్ అయ్యే తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి యూజర్ల కోసం వాట్సాప్ గత వారం ఒక సెర్చింగ్ ఫీచర్ ను కూడా యాడ్ చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *