మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. పోలీసులకు స్వీట్లు పంచిన ఆర్మీ ఆఫీసర్

When an army officer told policemen We are proud of you

కరోనా కష్టకాలంలో ముందుండి వైరస్ తో పోరాడుతున్న పోలీసులను భారత ఆర్మీ ప్రశంసలతో ముంచెతుత్తోంది. కరోనా వారియర్లుగా పోరాడే పోలీసులను చూస్తే గర్వంగా ఉందంటూ ఆర్మీ అధికారి ఒకరు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు స్వీట్లను పంపిణీ చేశారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Bikaner police తన ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. భారత ఆర్మీ అధికారి ఇద్దరు పోలీసులతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో పోలీసులు చేస్తున్న పోరాటం ప్రశంసనీయమని అధికారి చెప్పారు.

‘పోలీసులు చేస్తున్న మంచి పనితో మేం చాలా గర్వపడుతున్నాం. భారత ఆర్మీ కూడా గర్వపడుతోంది. కరోనాతో పోరాడుతున్న పోలీసులందరికి స్వీట్లను పంచాలని తమ ఆర్మీ జవాన్లు అడిగినట్టు అధికారి తెలిపారు. ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ తమ విధులను నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారిన అధికారి పేర్కొన్నారు. భారత ఆర్మీ నుంచి తీసుకొచ్చిన స్వీట్లు ప్రత్యేకించి పోలీసుల కోసం తయారుచేసినవిగా అధికారి తెలిపారు.

పోలీసులను ఆర్మీ అధికారి మెచ్చుకుంటున్న వీడియోకు వేలాది షేర్లు, రీట్వీట్లు వచ్చాయి. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో అందరిని ప్రేరేపించేలా ఉన్న వీడియోల్లో ఇదొకటిగా తెలిపారు. ఆర్మీ అధికారి పోలీసు సిబ్బందిని మెచ్చుకున్న విధానం హర్షింషదగినది.. జైహింద్ అంటూ ఖేర్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 

Read: తాకేది లేదు.. తొక్కడమే : మాల్‌ ఎలివేటర్లలో ఫుట్ పెడల్స్ బటన్లు 

మరిన్ని తాజా వార్తలు