అర్థరాత్రి ఆన్‌లైన్‌లో ఏం పని? తల్లిదండ్రులు మందలించారని ఇంట్లోంచి వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థిని లారా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

where is lara : తల్లిదండ్రులు మందలించారన్న కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది ఇంటర్‌ విద్యార్థిని. హైదరాబాద్‌ హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారంలో రవి కుమార్‌, అపర్ణ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటర్‌ చదువుతున్న కుమార్తె లారా కూడా వీరితో పాటే ఉంటోంది. అయితే అర్థరాత్రి అయినా సోషల్‌ మీడియాలో ఉంటూ చాటింగ్‌ చేస్తున్నావేంటని తల్లిదండ్రులు లారాను నిలదీశారు. దీంతో పేరెంట్స్‌తో గొడవ పడి బుధవారం(అక్టోబర్ 7,2020) అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లోంచి వెళ్లిపోయింది లారా.

తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు తల్లిదండ్రులు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాలనీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మౌంట్‌ లిటరజీ స్కూల్‌లో ఇంటర్‌ చదువుతోంది లారా. 24గంటలు దాటినా లారా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Related Posts