లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
× About Services Clients Contact
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందా?.. ‘నిశ్శబ్దం’ డైలాగ్ ప్రోమో చూశారా!..

Published

on

where-is-sonali-nishabdham-dialogue-promo1

Nishabdham Dialogue Promo: ఆర్.మాధవన్ మరియు అనుష్క షెట్టి జంటగా నటించి సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్.. ‘నిశబ్దం’ డైలాగ్ ప్రోమోతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సరికొత్త ఉత్కంఠతను సృష్టించింది. ఈ సినిమాను తమిళ్ మరియు మలయాళం భాషలలో ‘సైలెన్స్’ గా విడుదల చేస్తున్నారు.


ఒక హత్యను దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ప్రయత్నాన్ని ఈ ప్రోమో మరింత ఉత్కంఠ భరితంగా చూపిస్తుంది. ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించగా, టి జి విశ్వప్రసాద్ నిర్మించారు.


ఇండియా మరియు ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలలో ఉన్న ప్రైమ్ సభ్యులు, ‘నిశబ్దం’ సినిమా ని అక్టోబర్ 2, 2020 నుంచి తెలుగు, తమిళ్ మరియు మలయాళం భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో చూడొచ్చు.


ఈ ప్రోమోలో ఒక పాడుబడ్డ విల్లాలో జరిగిన దారుణాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి (అంజలి), ఆ సంఘటనకు సంబంధించిన కొన్ని నిజాలు వెలుగులోకి రావలసి ఉన్నాయని నిర్ధారణకి వచ్చి, తానే స్వయంగా ఈ సంఘటన వెనుకున్న నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయం తీసుకోవడం చూపించారు.


హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఈ చిత్రం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నారు. షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల ముఖ్యపాత్రలు పోషించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *