కరోనాతో బాధపడుతుంటే..ఐరాస ఏం చేసింది ? మోడీ సూటి ప్రశ్న

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

PM Modi at UNGA address : ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో తీవ్రంగా బాధ పడుతుంటే..ఐరాస ఏం చేసిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూటిగా ప్రశ్నించారు. గత 8 నుంచి 9 నెలలుగా ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోందనే విషయాన్ని గుర్తు చేశారు.మహమ్మారిని ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఐక్యరాజ్యసమితి ఎక్కడ ఉంది? సమర్థవంతమైన ప్రతిస్పందన ఏది? అంటూ ప్రశ్నలు సంధించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. వర్చువల్ ద్వారా జరిగిన ఈ ప్రోగ్రాంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన.వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని, సంక్షోభం నుంచి మొత్తం మానవాళిని బయటకు తీసుకురావడానికి భారత వ్యాక్సిన్ ఉత్పత్తి, వ్యాక్సిన్ డెలివరీలో పూర్తి సామర్ధ్యంతో పనిచేస్తుందని మోడీ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో భారత ఫార్మా రంగం 150 దేశాలకు మందులను సరఫరా చేసిందన్నారు.ఐరాస సంస్కరణలు చేయాలని భారత్ ఎదురుచూస్తోందని, ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందన్నారు. ఐరాస క్రియశీలక నిర్ణయాల్లో భారత్ భాగస్వామ్యం కానివ్వకుండా..ఇంకెన్నాళ్లు పక్కన పెడుతారు అంటూ వ్యాఖ్యానించారు. భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని, వందలాది భాషలు, వందలాది మాండలికాలు, అనేక మతాలు, అనేక భావజాలాలు కలిగిన దేశమన్నారు.వందలాది భాషలు, వందలాది మాండలికాలు, అనేక మతాలు, అనేక భావజాలాలు కలిగిన దేశమన్నారు. జన్ కళ్యాణ్ నుంచి జగత్ కళ్యాణ్ అనేది తమ విధానమని, శాంతి, భద్రత, శ్రేయస్సు కోసం భారతదేశ స్వరం ఎల్లప్పుడూ వినిపిస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి, భద్రతా మండలిలో నాన్ పర్మినెంట్ మెంబర్‌గా భారత్ తన బాధ్యతను నెరవేరుస్తుందన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, భద్రత, శ్రేయస్సుకు మద్దతుగా మాట్లాడుతుందని ప్రధాని మోడీ తెలిపారు.

Related Posts