ఆస్ట్రాజెనెకా, ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వి.. వీటిలో ఇండియన్లకు సెట్ అయ్యే వ్యాక్సిన్ ఏది? ప్రభావవంతంగా పని చేసేది ఏది?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

india coronavirus vaccines: ఆస్ట్రాజెనెకా కరోనా టీకాని సీరం ఇన్ స్టిట్యూట్ కనీసం రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తుంది సరే, మరి ఇతర వ్యాక్సిన్ల మాటేంటి.. ఎందుకంటే.. ఎంత తొందరగా వచ్చినా సరే, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన టీకా మన దేశం మొత్తం జనాభాకి సరిపోదు. అందుకే ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను కూడా మన దేశంలో అందుబాటులోకి తెస్తున్నారు. కానీ వీటిలో ఏది మన వాతావరణానికి సెట్ అవుతుంది. ఏ వ్యాక్సిన్ ఏ దశలో ఉంది.

మనకి ఏది సరైన టీకా అవుతుంది..? ఏ టీకా ప్రభావవంతంగా పని చేయగలదు?
వ్యాక్సిన్లు వస్తున్నాయ్ సరే.. మనకి ఏది సరైన టీకా అవుతుంది..? ఏ టీకా ఏ దశలో ఉంది.. యావత్ ప్రపంచాన్ని ఆరోగ్య సంక్షోభంలో పడేసిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు ముందునుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా శరవేగంగా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. భారత్‌లోనూ ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్ వి, ఫైజర్, కోవ్యాగ్జిన్, నోవావ్యాక్స్ తదితర వ్యాక్సిన్లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఇందులో కొన్ని టీకాలు ఈ ఏడాది(2020) చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటిలో ఏ టీకా భారత్‌లో కరోనాను సమర్థంగా నిరోధించగలదు. ఇక్కడి పరిస్థితులకు ఏ టీకా అయితే ప్రభావవంతంగా పని చేయగలదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2021 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్:
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మన దేశంలో రెండు కోవిడ్ 19 వ్యాక్సిన్ల ప్రయోగాలు చేపడుతోంది. అందులో ఒకటి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కోవీషీల్డ్ కాగా మరొకటి నోవావ్యాక్స్. ఐసీఎంఆర్‌తో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ రెండు వ్యాక్సిన్ల మూడో దశ ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలపై ఐసీఎంఆర్ సంతృప్తి వ్యక్తం చేసింది. అంతా సవ్యంగా సాగితే… ఈ ఏడాది(2020 చివరి నాటికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఒక బిలియన్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికై ఇప్పటికే ఆస్ట్రాజెనెకా సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే 2 బిలియన్ డోసుల నోవావ్యాక్స్ ఉత్పత్తి కోసం కూడా సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే మన దేశంలో వచ్చే(2021) ఫిబ్రవరి నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులో రావడం ఖాయంగా కన్పిస్తుంది.

మూడో దశ ప్రయోగాల్లో భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్‌:
ఇక దేశీ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవ్యాక్సిన్‌ కూడా మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఈ దశలో మొత్తం 26వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరపనున్నారు. కోవిడ్ -19కు కారణమయ్యే SARS-CoV-2 క్రియారహిత అణువుతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం వాడుతున్నారు. నోవావ్యాక్స్, కోవిషీల్డ్‌ల వ్యాక్సిన్ తయారీ దీనికి భిన్నంగా ఉంది. నోవావ్యాక్స్ కోసం కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ల నుంచి హానీ చేయని పదార్థాన్ని సేకరించి… దాన్ని సూక్ష్మ కణాలుగా అభివృద్ది చేస్తారు. కోవీషీల్డ్‌ను సాధారణ జలుబు వైరస్, అడెనోవైరస్ అణువు ద్వారా అభివృద్ది చేస్తున్నారు.

2021 మార్చి తర్వాతే జైడస్ క్యాడిలా వ్యాక్సిన్:
దేశీయంగా అభివృద్ది జరుగుతోన్న మరో కరోనా వ్యాక్సిన్ జైదుస్ క్యాడిలా. ఒకే డీఎన్ఏ ఆధారిత సాంకేతికతతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేస్తున్నారు. ఇదే సాంకేతికతను గతంలో హెపటైటిస్ సీ కోసం కూడా ఉపయోగించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు డిసెంబర్‌లో జరగనున్నాయి. 2021 మార్చి తర్వాతే జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ వచ్చే సూచనలున్నాయి. ఇక రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్ వి మూడో దశ ప్రయోగాలు హైదరాబాద్‌లోని డా.రెడ్డీస్ ల్యాబోరేటరీలో జరుగుతున్నాయి.

ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్స్ కూడా కరోనాపై పోరులో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. mRNA టెక్నాలజీ ఆధారంగా ఈ రెండింటిని అభివృద్ది చేస్తున్నారు. ఈ విధానంలో శరీర రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేసేందుకు సింథటిక్ జన్యు పదార్థాన్ని వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి పంపిస్తారు. ఇప్పటివరకూ జరిపిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్లు 90శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలిందని ఆ కంపెనీలు వెల్లడించాయి.

కోవ్యాక్సిన్, నోవావ్యాక్స్, కోవీషీల్డ్ లు భారత్ పరిస్థితులకు సరిపోతాయి:
భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవ్యాక్సిన్‌తో పాటు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రయోగాలు జరుపుతున్న నోవావ్యాక్స్, కోవీషీల్డ్‌లు భారత్ పరిస్థితులకు సరిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మూడు వ్యాక్సిన్ల  డోసులను 2-8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సి ఉంటుంది. ఒక రకంగా పోలింగ్ వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు అవసరమయ్యే ఉష్ణోగ్రతకు ఇది సమానమనే చెప్పాలి. రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ డోసులను భద్రపరచాలంటే మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఇలా మొత్తం మీద మన దేశంలో దాదాపు అర డజను వ్యాక్సిన్లు వచ్చే(2021) ఏడాది నాటికి పంపిణీకి సిద్ధం కాగా..ఏవి ముందు ఏవి తర్వాత పంపిణీ అవుతుందనేది కేంద్రం ఐసిఎంఆర్ కలిసి తీసుకునే నిర్ణయాన్ని బట్టి తేలనుంది.

Related Tags :

Related Posts :