వావ్.. వైట్ కావ్ : ఢిల్లీలో ‘తెల్ల కాకి’ చక్కర్లు : వైరల్ వీడియో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాకి అంటే నలుపురంగు. కాకి రంగు అదే అనే మాట అలా ఉండిపోయింది. కానీ కాకులు నల్లగానే ఉంటాయా? తెల్లకాకులు ఉండవా? అనే అనుమానం చాలాసార్లు చాలామందికి వచ్చింది. కానీ తెల్లకాకిని చూసినవారు బహుశా ఎవ్వరూ ఉండి ఉండరు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ ‘తెల్లకాకి’’చక్కర్లుకొట్టేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. దాన్ని చూసివారంతా కళ్లు తిప్పుకోవట్లేదట.

ఈ అరుదైన తెల్ల కాకి దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో ఓ కెమెరాకు చిక్కింది. నల్ల కాకులతో కలిసి రోడ్లపై గింజలు తింటోంది. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఆ వీడియోలు..ఫోటోలు వైరల్ గా మారాయి.

తెల్ల రంగు కాకులను ‘అల్బినో’ అని కూడా పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన కారణాల వల్ల లేదా హార్మోన్ల లోపం వలన కాకులు తెల్ల రంగులో పుడతాయని తెలుస్తోంది.

Related Posts