సెక్రటరీ పొరపాటుతో... ట్రంప్ బ్యాంక్ డీటెయిల్స్ బయటకు

White House press secretary reveals Trump's bank details

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రైవేటు బ్యాంకు సమాచారం బయటకు  వచ్చింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌ ఎనానీ చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల ట్రంప్ బ్యాంక్ సమాచారం బయటకు వచ్చింది. 

కరోనా వైరస్ నేపథ్యంలో ఇటీవల ట్రంప్... అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ (HHS) విభాగానికి తన 3 నెలల శాలరీని విరాళంగా ప్రకటించారు. దానికి సంబంధించి శుక్రవారం ప్రెస్‌ మీట్ ఏర్పాటు చేసిన వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కైలీ మెక్‌ ఎనానీ.. అధ్యక్షుడు ట్రంప్‌ HHS విభాగానికి మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం ఆమె ఒక చెక్‌ను అక్కడున్న చూపించారు. ఇక్కడే ఆమె పొరపాటు చేశారు.

ట్రంప్‌ మూడు నెలల వేతనానికి సంబంధించిన చెక్‌ తో పాటు, 1లక్ష అమెరికన్‌ డాలర్ల నగదు రాసి ఉన్న మరో చెక్‌ ను చూపించారు. అందులో ట్రంప్ పేరు, సంతకం మాత్రమే కాకుండా ట్రంప్‌ చిరునామాతోపాటు పూర్తి వివరాలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది. అధ్యక్షుడి ప్రైవేటు బ్యాంకు సమాచారం బయటకు పొక్కడం అంత మంచిది కాదని పలువురు విమర్శిస్తున్నారు.  కాగా, వైట్‌హౌస్‌ అధికారులు మాత్రం మీడియా ప్రతినిధులు ట్రంప్‌ ఇచ్చిన విరాళం గురించి కాకుండా కైలీ పొరపాటు గురించి ఎక్కువగా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు

మరిన్ని తాజా వార్తలు