చెప్పుకుని పుట్టాయా ఏంటీ! : తెల్లటి కుక్కకు పుట్టిన 13 నల్లపిల్లలే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘తెల్లావు కడుపున ఎర్రావు పుట్టదా?..కర్రావు కడుపున నల్లావు పెట్టదా?’ అనే పాట గుర్తుండే ఉంటుంది కదూ. అలాగు నల్ల కుక్కకు తెల్లకుక్కలు పుడతాయి. తెల్లకుక్కకు నల్ల రంగులో కుక్క పిల్లలు పుడతాయి. ఇది సర్వసాధారణం..పెద్ద వింతా విశేషం ఏమీ ఉండవు. కుక్కలకు, పిల్లులకు, మేకలకు ఒకే కాన్పులు ఎక్కువ పిల్లలు పుడతాయి. అవి రంగురంగుల్లో ఉంటాయి. కానీ ఓ తెల్లని కుక్కకు మాత్రం ఏకంగా 13 పిల్లలు పుట్టాయి. ఇంకో విశేషం ఏంటంటే..దానికి పుట్టిన ఆ 13 పిల్లలన్నీ నలుపు రంగులోనే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కదానికి కూడా తల్లి రంగురానేలేదు.

అన్ని పిల్లలు పుట్టినప్పుడు కనీసం ఒకటి రెండు పిల్లలన్నా..వేరు రంగులోనే లేదా రంగుల కలబోతగానో పుడతాయి. కానీ ఈ తెల్లకుక్కకు పుట్టిన 13 పిల్లలూ నల్లటి కారు నలుపు రంగులో పుట్టాయి. ఎక్కడా ఒక్క చుక్క తెలుపుగానీ వేరే రంగుగానీ లేనే లేదు. వీటిని చూసుకుని ఆ కుక్క యజమాని తెగ మురిసిపోతోంది. మా బుజ్జీ పిల్లలు అంటూ తెగ ఆనందపడిపోతోంది.

ఆ తల్లి కుక్క వయస్సు మూడేళ్లు. గోల్డెన్ లాబ్రడార్ జాతికి చెందిన కుక్క. పేరు లూసీ.ఎనిమిదేళ్ల బ్లాక్ ల్యాబ్ బాస్టిన్‌తో జతకట్టి గర్భం ధరించింది లూసీ. ఆ కుక్కను పెంచుకుంటున్న యజమానురాలు కేథరీన్‌ స్మిత్‌ ఇన్ని కుక్కలకు తాను యజమానిని అయ్యానంటూ ఆశ్చర్యంతో పాటు తెగ ఆనందపడిపోతోంది.

లూసీ ఒకదానివెంట ఒక కుక్కపిల్లకు జన్మనిస్తుంటే ఆశ్చర్యపోయానని యజమాని తెలిపింది. తాను కుక్కను పెంచుకోవడం ఇదే మొదటిసారని వెల్లిడించింది. ‘లూసీ ఐదు లేదా ఆరు కుక్క పిల్లలకు జన్మనిస్తుందని అనుకున్నాను. కానీ అది నా అంచనాలను తలకిందులు చేసి ఏకంగా 13 పిల్లలకు జన్మనిచ్చింది. అన్నీ నలుపు రంగులోనే ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యం కలిగింది. 20 నిమిషాల్లో నాలుగు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. కానీ చివరి నాలుగు గంటల వరకు చూస్తే మొత్తం 13 కుక్క పిల్లలు ఉన్నాయి’ అని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

అబ్బా వీటన్నింటినీ ఆమె ఎలా పెంచుతుందోనని ఆశ్చర్యపడనవసరం లేదు. జాతి కుక్కలు..జాతికుక్కలతో కలవగా పుట్టిన ఒరిజినల్ బ్రీడ్ కుక్కపిల్లలకు మంచి డిమాండ్ ఉంది. అదో పెద్ద బిజినెస్సే మరి. బాగా డబ్బులు వచ్చి పడతాయి. లూసీకి పుట్టిన 13 పిల్లల్లో చాలా వరకూ అమ్ముడౌపోయాయి.

Related Posts