Home » ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా.. 2021లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశమే లేదు : WHO
Published
2 weeks agoon
COVID-19 Herd Immunity Unlikely In 2021 Despite Vaccines : ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా 2021 ఏడాదిలో హెర్డ్ ఇమ్యూనిటీ చేరుకోనే అవకాశమే లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాక్సిన్లతో హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యాన్ని చేరుకునే ఛాన్స్ ఉందని WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆమోదం పొందిన వివిధ కరోనా వ్యాక్సిన్లు ప్రపంచ జనాభా కోసం టీకాలను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది కొంతవరకు ఆశాజనకమేనని అన్నారు. అయినప్పటికీ 2021లో అన్ని దేశాల్లో జనాభాకు హెర్డ్ ఇమ్యూనిటీని సాధించే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ఒకవేళ అది జరిగినా.. ఏదో కొన్ని దేశాల్లో మాత్రమే సాధ్యపడుతుంది తప్పా ప్రపంచ జనాభాను కరోనా వైరస్ నుంచి రక్షించలేమని తెలిపారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి పంపిణీ చేయడం పెద్ద సవాళ్లతో కూడిన ప్రక్రియగా స్వామినాథన్ పేర్కొన్నారు. టీకాల ఉత్పత్తికే ఎక్కువ సమయం పడుతుంది. అది మిలియన్లలో కాదు.. బిలియన్లలలో వ్యాక్సిన్ మోతాదుల అవసరం ఉందని ఆమె తెలిపారు. అప్పటివరకూ ప్రతిఒక్కరూ ఒపిగ్గా సహనంతో ఎదురుచూడాల్సిందేనని స్పష్టం చేశారు.
2020 ఏడాది చివరిలో యూఎస్ నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డీసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కూడా 2021లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తామని అంచనా వేశారు. కానీ, వ్యాక్సిన్లను ఎంతమంది జనాభాకు సమర్థవంతంగా పంపిణీ చేశామన్నదానిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. స్వీడన్ వంటి దేశాల్లో తొందరగా హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యానికి చేరువయ్యాయి.
మొదటినుంచి ఎక్కడా కూడా లాక్ డౌన్ లు లేవు.. వ్యాక్సిన్ అందుబాటులో కూడా లేదు. ఇటీవల కాలంలో ఆయా దేశాల్లో రికార్డు సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. కానీ, ఆ తర్వాత కింగ్ ఆఫ్ స్వీడన్ కూడా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడంలో విఫలమైంది. సాధారణంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే 50 నుంచి 90 శాతం జనాభాకు వ్యాక్సిన్ అందించాల్సి ఉంటుంది.