ఆరోగ్యసేతు యాప్ గురించి ప్రభుత్వం ఎందుకు నిజం చెప్పడం లేదు: RTI

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మిలియన్ కొద్దీ ఇండియన్లు Aarogya Setu యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. కరోనావైరస్ తో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ ప్రభుత్వం కండిషన్ కూడా పెట్టింది. ఆరోగ్య సేతు వెబ్ సైట్ మాత్రం ఇది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండ్ ఐటీ మినిస్ట్రీ డెవలప్ చేసిందని చెప్తుంది. అసలు ఈ యాప్‌ను ఎవరు క్రియేట్ చేశారని రైట్ టు ఇన్ఫర్మేషన్ క్వైరీ వేసి అడిగారు.

అటు నుంచి వచ్చిన సమాధానాన్ని కూడా టాప్ ఆర్టీఐ బాడీ సమ్మతించలేదు. యాక్టివిస్ట్ సౌరవ్ దాస్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కంప్లైంట్ చేస్తూ.. పలు మినిస్ట్రీలు ఆరోగ్యసేతు యాప్ గురించి సరైన సమాచారం ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు.ఈ యాప్ పెట్టడానికి ప్రపోజల్ ఎక్కడి నుంచి వచ్చింది. అప్రూవల్ ఎలా దొరికింది, ఏయే కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వ్యక్తిగతమైనవా, ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయా, ఈ యాప్‌ డెవలపింగ్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రైవేట్ వ్యక్తులతో కమ్యూనికేషన్ అయి ఉంటే ఆ కాపీలు కావాలని అడిగాడు.

రెండు నెలల పాటు తిరిగిన క్వైరీ పలు డిపార్ట్‌మెంట్లను చుట్టేసింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దీని క్రియేషన్ పూర్తిగా ఎన్ఐసీ చేతుల్లో లేదని తేల్చి చెప్పేసింది. ఐటీ మినిస్ట్రీ దీనిని నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ కు ట్రాన్సఫర్ చేయగా.. ‘దీని గురించి ఇన్ఫర్మేషన్ మాకు సంబంధించింది కాదు’ అని చెప్పింది.

చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఆర్టీఐ బాడీ. అంతేకాకుండా ప్రభుత్వం ఈ అప్లికేషన్ కు సరైన సమాధానం ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుంటుందని ప్రశ్నించింది ఆర్టీఐ.

Related Tags :

Related Posts :