లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

నలభై నాలుగు మ్యాచ్‌లు బెంచ్‌లోనే.. ఎవరు ఈ మోను కుమార్.. ధోనీ భార్య అసిస్టెంట్ అనుకున్నారు.. వరల్డ్ కప్ జట్టులో ఒకడు..

Published

on

మోను కుమార్ సింగ్.. ఐపీఎల్ 2020లో 44మ్యాచ్‌ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన స్పెషలిస్ట్ బౌలర్.. దాదాపు రెండున్నర సీజన్లు పాటు బెంచ్‌కే పరిమితం అయిన మోను కుమార్ సింగ్ బెంగళూరు జట్టుపై మ్యాచ్‌లో తొలిసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 25 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మోను కుమార్ 1994లో పుట్టిన జార్ఖండ్ రాజధాని రాంచీ నగరానికి చెందినవాడు.మహేంద్ర సింగ్ ధోని స్వస్థలమైన రాంచీ నుంచి క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మోను.. 2014 సంవత్సరంలో విజయ్ జోల్ సారధ్యంలో ఆడిన అండర్ -19 ప్రపంచ కప్ భారత జట్టులో కూడా ఒకరు. 2015-16లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ద్వారా జార్ఖండ్ తరఫున దేశీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు మోను. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 44వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మొదటిసారి ఐపీఎల్ XI లో ఉండే అవకాశం మోనుకు దక్కింది.ఫాస్ట్ బౌలర్ మోను కుమార్ శార్దుల్ ఠాకూర్ స్థానంలో ప్లేయింగ్ పదకొండులోకి వచ్చాడు. మోను కుమార్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగం అయ్యాడు. కానీ 43 ఐపిఎల్ మ్యాచ్‌ల తర్వాత అతనికి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అభిమానులు మోను కుమార్‌ను ధోని భార్య సాక్షికి సహాయకుడిగా కూడా కొన్ని రోజులు భావించారట.మోను కుమార్ రాంచీ నుంచే ధోనీకి దగ్గరగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో ధోనీ కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ధోనీ భార్యతో మోను ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఇందులో సాక్షి ధోని, మోను కుమార్ తలపై ముద్దు పెట్టుకోవడం కనిపించింది. చాలా మంది అభిమానులు అతనిని సాక్షకి సహాయకుడిగా భావించారు.ధోని నగరానికి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ ఖచ్చితమైన లైన్‌తో బౌన్సర్‌కు పేరుగాంచాడు. 2017 సంవత్సరంలో, MS జార్ఖండ్ తరఫున ఎంఎస్ ధోని విజయ్ హజారే ట్రోఫీని ఆడారు, ఇందులో మోను కుమార్ కూడా ఉన్నారు. ఆ సమయంలో, మోను కుమార్ ధోనికి పరిచయం అయ్యాడు. అతనిలో ప్రతిభను గమనించిన ధోనీ 2018 సంవత్సరంలో చెన్నై నిషేధం తర్వాత తిరిగి రావడంతో మోనుకు జట్టులో చోటు కల్పించారు.దీపక్ హుడా, శ్రీయాస్ అయ్యర్, సర్ఫ్‌రాజ్ ఖాన్, కుల్‌దీప్ యాదవ్, సంజూ శాంసన్.. కూడా 2014లో వరల్డ్ కప్ అండర్ 19 జట్టు నుంచి క్రికెట్‌లో కీలకంగా మారినవారే. మోను డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్.. రెండున్నర సీజన్‌ల నుంచి బెంచ్‌లో ఉన్నాడు. బేస్ ప్రైస్ ఇరవై లక్షలకు మోను కుమార్‌ను జట్టులోకి తీసుకుంది చెన్నై జట్టు. అయితే వచ్చిన మొదటి మ్యాచ్ అవకాశంలో మోనుకుమార్ రెండు ఓవర్లు వేసి 20పరుగులు సమర్పించుకున్నాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *