ఐపీఎల్‌లో మెరిసిన యువ తుఫాన్.. ఆర్‌సీబీ హీరో.. ఎవరు ఈ పాడిక్కల్?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పోరాటతత్వమే మనిషిని నిలబెడుతుంది. ప్రపంచం దృష్టికి తీసుకుని వెళ్తుంది. క్రికెట్‌లో కూడా అంతే.. ఎంత టాలెంట్ ఉన్నా కూడా టైమ్ వచ్చినప్పుడు ప్రదర్శిస్తేనే హీరో అవుతారు. జట్టు ఇక్కట్లో పడ్డప్పుడు పోరాడి గెలిపించేందుకు ఒకడు ఉండాలి.. ఆ ఒక్కడే ఇప్పుడు పాడిక్కల్ రూపంలో ఆర్‌సీబీకి దొరికారు అని అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్). అందులోనూ ఎక్కువగా అభిమానులు ఉన్న టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఇప్పటివరకు ఈ టీమ్ మాత్రం టైటిల్ రేసులో నిలవలేదు. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. లాస్ట్ సీజన్‌లో ఈ టీమ్‌కు ఓపెనింగ్ సమస్య తీవ్రంగా ఉంది. అయితే ఈసారి మాత్రం యువ తుఫాన్, కేరళ క్రికెటర్ దేవదత్ పాడిక్కల్‌ రూపంలో ఆ లోటు తీరినట్లుగా కనిపిస్తుంది.


తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో కదం తొక్కిన పాడిక్కల్ ఓవర్ నైట్ ఐపిఎల్‌లో ఆర్‌సీబీ హీరో అయిపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేసిన దేవదత్ పాడిక్కల్‌ తొలి మ్యాచ్‌లోనే ఐపిఎల్‌లో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపిఎల్ 2020 మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్‌సిబి ఓపెనర్‌గా ఆరోన్ ఫించ్‌తో కలిసి 20 ఏళ్ల దేవదత్ పాడికల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. పాడిక్కల్ 36 బంతుల్లో ఐపిఎల్ కెరీర్‌లో మొదటి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌పై 36 బంతుల్లో 8 ఫోర్లతో 8 సెంచరీలు సాధించిన దేవదత్ పాడికల్ 140 కి పైగా స్ట్రైక్‌రేట్‌తో ఇన్నింగ్స్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు.
2018 సంవత్సరంలో దేవదత్ పాడిక్కల్‌ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 7 పరుగులకు అవుట్‌ అయ్యాడు.. కానీ రెండవ ఇన్నింగ్స్‌లో అతను అర్ధ సెంచరీ సాధించాడు. మహారాష్ట్రపై 77 పరుగులకు అవుటయ్యాడు. గత సంవత్సరం, అతను లిస్ట్ ఎ తరఫున దేశీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. జార్ఖండ్‌పై 58 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. గతేడాది టీ 20 క్రికెట్‌లో ఉత్తరాఖండ్‌పై 53 పరుగులకు అవుటయ్యాడు. ఇప్పుడు ఐపిఎల్ అరంగేట్రంలో 56 పరుగులు చేసి అవుటయ్యాడు.

READ  అమరావతి జేఏసీ ప్రకటన - చిరు ఇంటివద్ద భారీగా అభిమానులు
Tournament Matches Runs Avg. 50s/100s HS
Ranji Trophy 19/20 10 649 45.56 7/0 99
Vijay Hazare 19/20 11 609 67.66 5/2 103*
SMAT 19/20 12 580 64.44 5/1 122*

విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఓపెనర్ దేవదత్ పాడిక్కల్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్‌లకు ఈసారి టీమ్‌లో అవకాశం కల్పించారు. ఈ ఇద్దరు ఆటగాళ్ళ వయస్సు 20 సంవత్సరాలు. అదే సమయంలో, డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్రియామ్ గార్గ్‌కు అవకాశం లభించింది. ప్రియమ్ గార్గ్ కూడా 20 ఏళ్లకే ఐపిఎల్ ఆడుతున్నాడు.
ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఐపిఎల్‌లోకి అడుగుపెట్టిన ప్రియామ్ గార్గ్ భారత అండర్ 19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ఏడాది ఆడిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ చోటు దక్కించుకుంది, కాని జట్టు విజయం సాధించలేదు.


Related Posts